బ్యాంకు సర్వర్లు హ్యాక్ చేసి రూ. 5 కోట్లు స్వాహా: దినేష్ ను అరెస్ట్ చేసిన హైద్రాబాద్ పోలీసులు

బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల సర్వర్లు హ్యాక్ చేసి రూ. 5 కోట్లు స్వాహా చేసిన వారిని పోలీసులు బుధవారం నాుడ అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి రూ. 53 లక్షలు స్వాదీనం చేసుకొన్నారు.

Three Held For Hacking Into Bank servers in hyderabad

హైదరాబాద్: Banks, ఫైనాన్స్ సంస్థల సర్వర్లు Hacking చేసి రూ. 5 కోట్లు స్వాహా చేసిన వ్యక్తిని పోలీసులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు. Vijayawadaకు చెందిన వనం శ్రీరామ్, దినేష్ కుమార్  పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడి నుండి రూ. 53 లక్షలు సీజ్ చేశారు.ఢిల్లీలో ఉన్న మహాగ్రామ్ అనే గేట్ వేను హ్యాక్ చేసి రూ. 16 లక్షలు తన అకౌంట్ కు బదిలీ చేశారు.

గతంలో హైద్రాబాద్ కు మహేష్ బ్యాంకులో కూడా సర్వర్లను హ్యాక్ చేసి నిందితులు  డబ్బులు కాజేశారు. మహేష్ బ్యాంకు  నుండి నిధులను మళ్లించే క్రమంలో సైబర్ నేరానికి పాల్పడిన నైజీరియన్లు జాగ్రత్తలు తీసుకొన్నారు. పక్కా ప్లానింగ్ తో నిందితులు ఈ బ్యాంకు సర్వర్ ను హ్యాక్ చేశారని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. 

బ్యాంక్ సర్వర్  నుండి నిధులను ఇతర ఖాతాల్లోకి మళ్లించే సమయంలో రెడ్ ట్యాగ్ మోగకుండా జాగ్రత్తలు తీసుకొన్నారని పోలీసులు గుర్తించారు. సేవింగ్స్ ఖాతాలకు భారీ మొత్తంలో డబ్బులు బదిలీ అయితే ఆర్బీఐకి, ఐటీ శాఖకు అలారం అందుతుంది. అయితే ఈ విషయంలో నైజీరియన్లు జాగ్రత్తలు తీసుకొన్నారు.


మహేష్ బ్యాంకు కేసులో సర్వర్ హ్యాక్  ఘటనలో నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా కష్టపడ్డారు.
హిందూస్తాన్ ట్రేడర్స్ పేరుతో మహేష్ బ్యాంకులో వినోద్ అకౌంట్ తెరిచారు. ఈ బ్యాంక్‌ అకౌంట్ ద్వారానే వివిధ ఖాతాల్లోకి డబ్బులు మళ్లించారు. ఇక, నేరానికి పాల్పడిన అనంతరం బ్యాంకు సర్వర్‌లో ఆధారాలను కేటుగాళ్లు తొలగించారు. బ్యాంక్ సర్వర్లను 18 గంటల పాటు వారి ఆధీనంలో ఉంచుకున్నట్టుగా తెలుస్తోంది. 

ముంబైకి చెందిన ఓ మహిళతో సైబర్‌ నేరగాళ్లు మహేష్‌ బ్యాంక్‌‌లో ఖాతా తెరిపించారు. ఈ పనికి హుస్సెనీఆలంలోని ఓ వ్యాపారవేత్తను ఉపయోగించుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆ అకౌంట్‌కు సంబంధించిన ఫోన్ నెంబర్ అందుబాటులో లేకుండా పోయింది. ఈ సైబర్ చోరికి పాల్పడక ముందు నేరగాళ్లు.. మూడు ఖాతాలు ఉన్న బ్యాంక్ శాఖలకు వెళ్లి పరిస్థితులను గమనించి ఉంటాడని అనుమానిస్తున్నారు. 

మహేష్ బ్యాంక్ సర్వర్‌ను బంజారాహిల్స్‌లోని ఓ సంస్థ నిర్వహిస్తుండగా.. సాఫ్ట్‌వేర్‌ను ముంబైకి చెందిన సంస్థ అందించింది. ప్రాక్సీ సర్వర్‌తో సైబర్ నేరగాళ్లు సర్వర్‌ను యాక్సెస్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ నేరం చేయడానికి ముందు సైబర్ నేరగాళ్లు.. చెస్ట్ ఖాతాను యాక్సిస్ చేసి ఈ మూడు ఖాతాల లావాదేవీల పరిమితిని రూ. 50 కోట్లకు పెంచేశారు. సైబర్ నేరగాళ్లు.. డైరెక్ట్‌గా సర్వర్‌ను హ్యాక్ చేశారా..? లేదా బ్యాంక్ సాఫ్ట్‌వేర్ లోకి ప్రవేశించి సర్వర్‌ను హ్యాక్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. ఐపీ ఆడ్రస్ ప్రకారం అమెరికా, కెనడా నుంచి ఈ ఆపరేషన్ చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

గతేడాది జూలైలో తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్‌ కోర్ బ్యాంక్ ఖాతా నుంచి సైబర్ మోసగాళ్లు రూ. 1.96 కోట్లు స్వాహా చేశారు. తాజాగా మహేష్ బ్యాంక్‌లో చోటుచేసున్న చోరి కూడా.. ఆ ఘటనను పోలి ఉంది. మొదట కోర్ ఖాతా నుంచి ఖాతాదారుల ఖాతాలకు నిధులను తరలించి.. అక్కడి నుంచి వివిధ బ్యాంక్ ఖాతాలను డబ్బులు బదిలీ చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios