హైదరాబాద్‌లో తెలంగాణ శాసనసభ సమీపంలో శుక్రవారం కలకలం రేగింది . జూబ్లీహాల్ ఆవరణలో చెత్తను తొలగిస్తుండగా 3 తుపాకులు బయటపడ్డాయి. ఆ తుపాకులు ఎవరివి..? కట్టుదిట్టమైన భద్రత వుండే అసెంబ్లీ ప్రాంగణంలోకి ఎలా వచ్చాయన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
హైదరాబాద్‌లో తెలంగాణ శాసనసభ సమీపంలో శుక్రవారం కలకలం రేగింది. జూబ్లీహాల్‌లోని శాసనమండలి సమీపంలో రివాల్వర్లు వెలుగుచూశాయి. జూబ్లీహాల్ ఆవరణలో చెత్తను తొలగిస్తుండగా 3 తుపాకులు బయటపడ్డాయి. చెట్ల పొదల్లో 1 తపంచా, రెండు నాటు తుపాకులు కనిపించాయి. దీనిపై అసెంబ్లీ సిబ్బంది సైఫాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు 3 రివాల్వర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ తుపాకులు ఎవరివి..? కట్టుదిట్టమైన భద్రత వుండే అసెంబ్లీ ప్రాంగణంలోకి ఎలా వచ్చాయన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
