నిజామాబాద్‌లో సెల్ఫీ మోజు ముగ్గురి ప్రాణాలు తీసింది. అలీసాగర్ ప్రాజెక్ట్‌లో పడి ముగ్గురు బాలికలు మృతి చెందారు. మృతులను బోధన్.. రాకాసిపేట వాసులుగా గుర్తించారు. వీరి మరణంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

సెల్ఫీ మోజే ఈ విషాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాదకర స్థలంలో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి ముగ్గురూ నీట మునిగారు. మృతులను జుబేరా (16), మీరాజ్ (14), మషేరా (12)గా నిర్ధారించారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.