మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. డోర్నకల్‌ మండలం అందనాలపాడులో గుడిలో మైక్ సెట్ చేస్తుండగా విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతిచెందారు. 

మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. గుడిలో మైక్ సెట్ చేస్తుండగా విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతిచెందారు. వివరాలు.. డోర్నకల్‌ మండలం అందనాలపాడులో రామాలయానికి మైక్ సెట్ చేస్తుండగా విద్యుత్ షాక్‌తో ముగ్గురు దుర్మరణం చెందారు. మృతులను సుబ్బారావు, మస్తాన్‌రావు, వెంకయ్యలుగా గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారుమైకులు కడుతున్న పైపు ఇనుపది కావడం వలనే విద్యుత్ షాక్ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.