హైదరాబాద్ నగరంలోని పుప్పాలగూడలో విషాదం చోటుచేసుకుంది. గోడ కూలి ముగ్గురు దుర్మరణం చెందారు. సెల్లార్‌లో గుంత తీయడంతో గోడ కూలినట్టుగా తెలుస్తోంది. 

హైదరాబాద్ నగరంలోని పుప్పాలగూడలో విషాదం చోటుచేసుకుంది. గోడ కూలి ముగ్గురు దుర్మరణం చెందారు. సెల్లార్‌లో గుంత తీయడంతో గోడ కూలినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఘటన స్థలంలో శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. మృతులు బిహార్ వాసులుగా తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.