ఖమ్మంలో మామిడి తోటలో ఉరివేసుకుని ముగ్గురు ఆత్మహత్య...
ఖమ్మంలో ఓ కుటుంబం మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంది. మామిడి తోటలో ఉరివేసుకుని ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఖమ్మం : తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా కొత్త కారాయి గూడెంలో మామిడి తోటలో ఉరివేసుకుని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను వెంకట కృష్ణారావు, సుహాసిని, అమృతలుగా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబం.
భార్య సుహాసినికి క్యాన్సర్ ఉండడంతో వెంకట కృష్ణారావు మనస్థాపం చెందాడు. ఆమె బతకదని తీవ్ర విషాదానికి లోనై చనిపోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు భార్య, కూతురుతో కలిసి మామిడి తోటలో ఉరివేసుకుని చనిపోయాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.