రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండల పరిధిలోని సోలీపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. 

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండల పరిధిలోని సోలీపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మృతులను అక్షిత్ గౌడ్, ఫరీద్, పర్వీన్‌గా గుర్తించారు. ముగ్గురు చిన్నారులు కూడా పదేళ్లలోపు వయసు గలవారే. ఈ ఘటనతో చిన్నారుల కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నీటి గుంతలో నుంచి ముగ్గురు చిన్నారుల మృతదేహాలను గ్రామస్థులు వెలికితీశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred