Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్‌లో సూపర్ మార్కెట్లోకి అనుమతి నిరాకరణ:ముగ్గురి అరెస్ట్

విదేశీయులను పోలినట్టుగా ఉన్నారనే కారణంగా సూపర్ మార్కెట్ లోకి అనుమతించకపోవడంతో బాధితులు మంత్రి కేటీఆర్ కు ఫిర్యాదు చేశారు ఈ విషయమై చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు.

Three arrested for not permit into supermarket in Hyderabad
Author
Hyderabad, First Published Apr 9, 2020, 5:17 PM IST

హైదరాబాద్: విదేశీయులను పోలినట్టుగా ఉన్నారనే కారణంగా సూపర్ మార్కెట్ లోకి అనుమతించకపోవడంతో బాధితులు మంత్రి కేటీఆర్ కు ఫిర్యాదు చేశారు ఈ విషయమై చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు.

హైద్రాబాద్ వనస్థలిపురంలోని ఓ సూపర్ మార్కెట్ లో నిత్యావసర సరుకులను కొనుగోలు చేసేందుకు మణిపూర్ కు చెందిన చెందిన ఇద్దరు వెళ్లారు.  అయితే వీరు విదేశీయుల మాదిరిగా ఉండడంతో సూపర్ మార్కెట్ నిర్వాహకులు వారిని అనుమతించలేదు.

తాము ఇండియాకు చెందినవారమేనని వారు తమ ఆధార్ కార్డులను కూడ సూపర్ మార్కెట్ నిర్వాహకులకు చూపారు. అయితే వారు మాత్రం అనుమతించలేదు.  దీంతో మణిపూర్ కు చెందిన జోనా అనే వ్యక్తి మంత్రి కేటీఆర్ కు ఈ విషయమై ఫిర్యాదు చేశాడు. 

ఈ ఫిర్యాదును దృష్టిలో ఉంచుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపిని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.  ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని రాచకొండ కమిషనర్ ను ఆదేశించాడు డీజీపీ.

Also read:గాంధీలో డాక్టర్లపై దాడిపై విచారణ: సీఎస్, డీజీపీకి హైకోర్టు నోటీసులు

డీజీపీ ఆదేశాల మేరకు వనస్థలిపురం సూపర్ మార్కెట్ మేనేజర్, ఇద్దరు సెక్యూరిటీ గార్డులను పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు.ఈ తరహా ఘటనలు జరిగితే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు ప్రజలను కోరారు. 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య బుధవారం నాటికి 453కి చేరుకొన్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios