గాంధీలో డాక్టర్లపై దాడిపై విచారణ: సీఎస్, డీజీపీకి హైకోర్టు నోటీసులు
గాంధీ ఆసుపత్రిలో డాక్టర్లపై దాడి చేసిన విషయంపై ఏం చర్యలు తీసుకొన్నారో చెప్పాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీకి గురువారం నాడు నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో డాక్టర్లపై దాడి చేసిన విషయంపై ఏం చర్యలు తీసుకొన్నారో చెప్పాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీకి గురువారం నాడు నోటీసులు జారీ చేసింది.
కరోనా వైరస్ సోకిన బాధితుడు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుడి బంధువులు డాక్టర్లపై దాడికి దిగారు. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దాడికి పాల్పడిన వారిలో కరోనా రోగి కూడ ఉండడం గమనార్హం.
Also read:గాంధీ వైద్యులపై దాడిపై సీరియస్: కరోనా రోగితో పాటు మరో ముగ్గురిపై కేసు
హైద్రాబాద్ కుత్బుల్లాపూర్ కు చెందినవారుగా వీరిని గుర్తించారు. దాడి చేసిన వారిలో ఉన్న కరోనా రోగితో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై ఓ న్యాయవాది హైకోర్టుకు లేఖ రాశారు.
ఈ లేఖను పిల్ గా హైకోర్టు స్వీకరించింది. గురువారం నాడే కేసు విచారణను చేపట్టింది. ఈ లేఖలో న్యాయవాది ప్రస్తావించిన అంశాలను కోర్టు అడిగి తెలుసుకొంది. గాంధీలో వైద్యులపై దాడి ఘటనపై ఏ రకమైన చర్యలు తీసుకొన్నారో చెప్పాలని ప్రభుత్వానికి, డీజీపీ, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది.
also read:గాంధీలో డాక్టర్లపై దాడి: తెలంగాణలో జూడాల నిరసన, మంత్రి తలసాని భేటీ
ఈ నెల 16వ తేదీలోపుగా ఈ విషయమై సమాధానం చెప్పాలని ఆదేశించింది.ఈ నెల 16న కేసును విచారణ చేయనున్నట్టుగా హైకోర్టు ప్రకటించింది. మరో వైపు కరోనా రోగులకు వైద్యం చేస్తున్న డాక్టర్లకు ఏ రకమైన రక్షణ చర్యలు తీసుకొంటున్నారో చెప్పాలని కోర్టు కోరింది.