హైద్రాబాద్ లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఎనిమిది మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు.


హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్‌ ఉప్పర్‌పల్లిలో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులను ఎస్ఓటీ పోలీసులు శుక్రవారంనాడు అరెస్ట్ చేశారు. కచ్చితమైన సమాచారం మేరకు ఇవాళ ఉదయం పోలీసులు నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న గోడౌన్ పై దాడి చేశారు. ఈ పేస్ట్ తయారు చేస్తున్న వారిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న వారి కోసం ఎస్ఓటీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

హైద్రాబాద్ నగరంలో గతంలో కూడ నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనలున్నాయి. ఈ నెల 21న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కులకచర్లలో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు