Asianet News Telugu

క్రైమ్ రౌండప్: ఈఎస్‌ఐలో భారీ కుంభకోణం...మరిన్ని వార్తలు

తెలంగాణ కార్మిక శాఖలోని ఈఎస్ఐ విభాగంలో జరిగిన భారీ కుంభకోణం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. దాంతో పాటు దొంగతనం చేసిందనే కోపంతో ఓ వివాహితను బంధించి ఆమెపై యజమాని సహా పలువురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలాంటి నేరవార్తలు మరిన్ని..

this week crime roundup
Author
Hyderabad, First Published Sep 29, 2019, 1:24 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

తెలంగాణ కార్మిక శాఖలోని ఈఎస్ఐ విభాగంలో జరిగిన భారీ కుంభకోణం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. దాంతో పాటు దొంగతనం చేసిందనే కోపంతో ఓ వివాహితను బంధించి ఆమెపై యజమాని సహా పలువురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలాంటి నేరవార్తలు మరిన్ని..

తెలంగాణ కార్మిక శాఖ పరిధిలోని వైద్య బీమా సేవల విభాగం ఈఎస్ఐకి మందులు సరఫరా చేసే విషయంలో భారీ కుంభకోణం జరిగింది. కాగా... ఈ కుంభకోణానికి బాధ్యురాలిని చేస్తూ... ఈఎస్ఐ డైరెక్టర్ దేవికా రాణిని శుక్రవారం ఉదయం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆమెను బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు.

గురువారం నుంచే ఏసీబీ అధికారులు దేవికా రాణి ఆఫీసులో తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా ఈ రోజు అదుపులో తీసుకున్నారు. ఈఎస్ఐ మందుల కొనుగోలు స్కాంలో దేవికారాణి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల నుంచి మందులు కొనడం, అసలు కొనకుండానే కొని, ఆస్పత్రులకు సరఫరా చేసినట్లు బిల్లులు సృష్టించడం లాంటి చర్యలతో రాష్ట్ర ఖజానాకు కనీసం పది కోట్ల రూపాయలకు పైగా నష్టం కలిగించినట్లు అవినీతి నిరోధక శాఖ దర్యాప్తులో తేలింది. 

ఈ నేపథ్యంలో 17 మంది ప్రభుత్వ ఉద్యోగులు, నలుగురు ప్రైవేటు వ్యక్తులపై ఏసీబీ అవినీతి నిరోధక చట్టం వివిధ సెక్షన్ల కేసులు నమోదు చేసింది. గత ఏడాది జరిగిన కుంభకోణంలో భాగస్వాములైన వైద్య బీమా సేవల డైరెక్టర్‌ డాక్టర్‌ సీహెచ్‌ దేవికారాణి, జాయింట్‌ డైరెక్టర్‌ కె.పద్మ సహా మొత్తం 21 మంది ఇళ్లు, కార్యాలయాల్లో గురువారం పెద్ద ఎత్తున సోదాలు జరిపింది.

గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన సోదాల్లో పలు కీలక పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఐఎంఎస్‌ విభాగంలో అవినీతి, అవకతవకలపై విజిలెన్స్‌ విభాగం నుంచి సమాచారం అందిన వెంటనే నిజం నిగ్గు తేల్చాలని ప్రభుత్వం ఏసీబీని ఆదేశించింది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ వైద్య బీమా సేవల విభాగం డైరెక్టర్‌తో పాటు మరికొందరు వ్యక్తులు కలిసి నకిలీ ఇండెంట్లు తయారు చేసి ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టినట్లు గుర్తించింది. దీనిలో భాగంగానే... శుక్రవారం దేవికా రాణిని అదుపులోకి తీసుకున్నారు.


అమ్మా అని పిలుస్తూనే కోరిక తీర్చాలన్నాడు

అమ్మ అని ఓ స్త్రీని పిలుస్తూనే... ఆమెపై కన్నేశాడు. ఆమెను అనుభవించాలని భావించాడు. కానీ... అతని వేధింపులు తట్టుకోలేక ఆ మహిళ ఆత్మహత్య చేసుకొని కన్నుమూసింది. భర్తను, కడుపున పుట్టిన ముగ్గురు బిడ్డలకు.. కేవలం ఓ కామాంధుడి కారణంగా ఆమె దూరం కావాల్సి వచ్చింది. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కంచలి మండలంలోని మహాత్మాగాంధీ ఉపాధి హామీ కార్యాలయంలో గతంలో ఇంజినీరింగ్ కన్సల్టెంట్ గా పనిచేసిన మాధవ్ కంచిలి స్టేట్ బ్యాంకు సమీపంలో ఓ ఇంట్లో అద్దెకు దిగాడు.

అనంతరం ఇంటి కిందనున్న స్థానిక ఏపీజీవీ బ్యాంకులో పనిచేస్తున్న ఓ కుటుంబంతో పరిచయం పెంచుకున్న మాధవ్... వారితో స్నేహంగా మెలిగేవాడు. అలాగే పైనున్న మరో కుటుంబంతో కూడా పరిచయం పెంచుకున్నాడు.

ఓ పోర్షన్ లో ఉండే భార్యభర్తలను అమ్మ, నాన్న అంటూ... మరో పోర్షన్ లో ఉండేవారిని అక్క, బావ అంటూ పిలిచేవాడు. ఈ క్రమంలో అమ్మ అని పిలిచే వివాహిత స్నానం చేస్తున్న సమయంలో ఫోన్ లో వీడియోలు, ఫోటోలు తీశాడు.

అనంతరం వాటిని ఆమెకు చూపించి తన కోరిక తీర్చాలంటూ బెదిరించేవాడు. దానికి ఆమె వ్యతిరేకించడంతో ఆ వీడియోలను ఇంటర్నెట్ లో పెడతానని బెదిరించేవాడు.

కొద్ది రోజుల తర్వాత మాధవ్ కి వేరే ప్రాంతానికి బదిలీ అయ్యింది. అయినా అతని వేధింపులు మాత్రం ఆగలేదు. వారం రోజుల క్రిందట మళ్లీ వివాహిత ఇంటికి వచ్చి వీడియోలు చూపించి బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని ఆమె తన కుటుంబసభ్యులకు కూడా తెలియజేసింది.

దీంతో ఆమె భర్త మాధవ్ కి వార్నింగ్ ఇవ్వాలని అనుకున్నాడు. అయినప్పటికీ... అతని వేధింపులు గుర్తుకు వచ్చి మనస్థాపానికి గురైన ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆమె సూసైడ్ నోట్ లో పేర్కొన్న వివరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. 

పహాడీఫరీఫ్ గ్యాంగ్‌రేప్‌ కేసులో నిందితుల అరెస్ట్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పహాడీ షరీఫ్ గ్యాంగ్ రేప్ కేసులో ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నాగర్‌కర్నూలు జిల్లా పర్యనాయక్ తండాకు చెందిన మహిళ తన కుటుంబంతో కలిసి నగరానికి వలస వచ్చింది.

హర్షగూడలోని ముచ్చా ప్రశాంత్ రెడ్డి అలియాస్ ప్రసాద్ రెడ్డికి చెందిన పౌల్ట్రీ ఫారంలో పనికి కుదిరారు. ఈ క్రమంలో సదరు దంపతులు దాణా సంచులను దొంగతనంగా విక్రయించినట్లు గుర్తించిన పౌల్ట్రీ యజమాని ప్రశాంత్ రెడ్డి ఈ నెల 18న రాత్రి సదరు మహిళను గదిలో బంధించి బెల్టు, కర్రలుతో తీవ్రంగా కొట్టాడు.

అనంతరం అతనితో పాటు సోదరుడు అనిల్ రెడ్డి, చాంద్రాయణగుట్టకు చెందిన భరత్, అలియాబాద్‌కు చెందిన దేవరశెట్టి పవన్ కుమార్, చిక్కింపురి హన్మత్ ఆమె‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

అంతటితో ఆగకుండా మూడు రోజుల పాటు నిర్బంధించి తీవ్రంగా కొట్టడంతో తాను సురేశ్ అనే వ్యక్తికి దాణా సంచులు విక్రయించినట్లు చెప్పడంతో అతనిని సైతం పిలిపించి తీవ్రంగా కొట్టారు.

అయితే ఈ నెల 21న సురేష్‌తో పాటు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో పలువురు పెద్దలు ఇద్దరికి రూ.2.50 లక్షలతో రాజీ చేశారు. విషయం బాధితుల బంధువుల దాకా వెళ్లడంతో వారి సాయంతో బాధితురాలు పహాడీషరీఫ్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురు నిందితులతో పాటు రాజీ చేసిన 10 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 


నీలిచిత్రాలకు బానిస: ఉన్మాదిలా మారి చిన్నారులకు చూపిస్తూ.. 

ఉన్మాదిలా మారిన ఓ వ్యక్తి పదేళ్ల బాలికకు నీలి చిత్రాలు చూపించాడు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని చంద్రబాబు నాయుడు కాలనీకి చెందిన పసుపులేటి దుర్గాప్రసాద్‌ వెదురు బొంగుల నిచ్చెనలు తయారు చేసి వాటిని విక్రయిస్తూ ఉండేవాడు.

పెళ్లయి 16 ఏళ్లు కావొస్తున్నా సంతానం కలగలేదు. అతని వేధింపుల కారణంగా భార్య సైతం పుట్టింటికి వెళ్లిపోయింది. దీనికి తోడు ప్రతిరోజు నీలిచిత్రాలు చూడటం దుర్గాప్రసాద్‌కు వ్యసనంగా మారింది.

అక్కడితో ఆగకుండా ఇంటికి సమీపంలోని బాలికలను పిలిచి వారికి కూడా ఆ దృశ్యాలను చూపిస్తూ పైశాచిక ఆనందం పొందేవాడు. దీనిని పసిగట్టిన స్థానికులు దుర్గాప్రసాద్‌కు గతంలో దేహశుద్ధి చేశారు.

అయినప్పటికీ బుద్ది మార్చుకోని అతను శనివారం తన ఇంటి సమీపంలో ఆడుకుంటున్న పదేళ్ల బాలికను పిలిచి సెల్‌ఫోన్‌లో నీలిచిత్రాలు చూపించాడు. దీంతో భయపడిని ఆ చిన్నారి ఏడుస్తూ వెళ్లి తల్లికి విషయం చెప్పింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె స్థానికుల సాయంతో దుర్గాప్రసాద్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. 


భర్తతో గొడవ: ఒంటరిగా వెళ్తున్న వివాహితపై గ్యాంగ్‌రేప్

నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ గిరిజన మహిళపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు గ్రామీణ మండలానికి చెందిన ఓ మహిళ తన భర్తతతో కలిసి శుక్రవారం రాత్రి పక్క వూరికి వెళ్లింది.

అక్కడ ఏదో మాట మీద భర్త ఆమెతో గొడవపడ్డాడు. దీంతో మనస్తాపం చెందిన వివాహిత స్వగ్రామానికి అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తోంది. ఈ క్రమంలో పక్క గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మార్గమధ్యంలో ఆమెను అడ్డగించి అత్యాచారం చేసి పారిపోయారు.

శనివారం బాధితురాలు తన బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అత్యాచారానికి పాల్పడింది కురుగొండ్ల నరసయ్య, సక్కిరాల రవి, బండ్ల కామాక్షయ్యలుగా గుర్తించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios