Asianet News TeluguAsianet News Telugu

సింగరేణి బోనస్ లో కేసిఆర్ గొప్పేం లేదట

  • దసరా అడ్వాన్స్ ను నెల నెలా కట్ చేసుకుంటారు
  • బోనస్ కేంద్రం ఇచ్చేదే... రాష్ట్రం పాత్ర నామమాత్రమే
  • సోషల్ మీడియాలో ఈ వివరాలతో ఒక పోస్టు వైరల్
this is singareni workers viral post

సింగరేణి కార్మికులను ఆకట్టుకునేందుకు తెలంగాణ సర్కారు రెండు కానుకలు ప్రకటించినట్లు మీడియాకు ప్రకటనలు విడుదల చేశారు. అందులో దసరా పండుగకు అడ్వాన్స్, దీపావళి పండుగకు బోనస్ ఇస్తున్నట్లు సింగరేణి ఎండి శ్రీధర్ ప్రకటించారు. కానీ ఇందులో తెలంగాణ సర్కార్ ఘనత ఏమీలేదని సింగరేణి కార్మికులు పెదవి విరుస్తున్నారు. సర్కారు ప్రకటించిన నజరానాలపై ఒక సింగరేణి కార్మికుడు రాసిన వార్త సోషల్ మీడియాలో చర్కర్లు కొడుతోంది. ఆ పోస్టు సారాంశం చూద్దాం.

1 మాకు ప్రతి ఏడాది దీపావళి bonus కింద కోల్ ఇండియా వారు కొంత డబ్బులు ఇస్తారు, దీనికి central government నిర్ణయంతో జరుగుద్ది .... కోల్ ఇండియా వారు మా యొక్క ప్రతిభను గుర్తించి దీపావళి బోనస్ సింగరేణి కార్మికులకు ఇస్తారు ఈసారి 57000 ఇచ్చారు... ఇవి జాతీయ సంఘాలు కోల్ ఇండియా తో మాట్లాడి ఇప్పిస్తారు. ఇది బొగ్గు బావుల్లో పనిచేసినందుకు కార్మికులకు ఆరోగ్య పరిస్థితిని గుర్తించి, పండుగ రోజుల్లో నా కార్మికుల యొక్క ముఖాళ్ళలో ఆనందం కొరకు గుర్తించి ఇచ్చినది.

2  singareni కార్మికునికి సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తో చర్చించి దసరా అడ్వాన్స్ ఇస్తుంది, ఈ యెక్క అడ్వాన్స్ ను తిరిగి ప్రతి నెల 2500/- రూ… సింగరేణి కార్మికుల జీతం నుండి మొత్తం 10 నెలలు జీతంలో కోత వేస్తారు. ఈసారి 25 వేలు ఇచ్చారు ప్రతి నెల ఇరవై అయిదు వందలు చొప్పున కోత కోస్తారు.

3 ఇది మన ముఖ్యమంత్రి గారు సింగరేణి కార్మికులుకు ఇచ్చిన నజరానా అని TV లో పేపర్లలో వచ్చింది. ఈ నిజాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.. దపావళి బోనస్ అనేది ముఖ్యమంత్రి గారి దయా దాక్షణ్యలతో ఇచ్చేది కాదు అది మా కార్మీకుల కష్టార్జితం...దయ చేసి తప్పుడు ప్రచారాలని తిప్పికొట్టండి.. కృతజ్ఞతలు.


....జై సింగరేణి.

మొత్తానికి ఈ పోస్టును సింగరేణి ఉద్యోగులు, వారసత్వ ఉద్యోగాలు ఆశించి భంగపడ్డ వారి పిల్లలు బాగా ఫేస్ బుక్, వాట్సాప్ తోపాటు ఇతర సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

 

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Follow Us:
Download App:
  • android
  • ios