Asianet News TeluguAsianet News Telugu

సంచలనం సృష్టించిన కీసర ఏసీబీ కేసు: మూడో నిందితుడు అనుమానాస్పద మృతి

కీసర తహసీల్దార్ అవినీతి కేసులో మూడో నిందితుడు కందాడి శ్రీకాంత్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతిగా మద్యం తాగడం వల్లే శ్రీకాంత్ రెడ్డి మరణించినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. తన ఇంట్లోనే శ్రీకాంత్ రెడ్డి మరణించాడు. అంతకు ముందు శ్రీకాంత్ రెడ్డి తండ్రి ధర్మారెడ్డి కూడా జైలు నుండి విడుదలైన రోజునే సూసైడ్ చేసుకొన్నాడు.

Third accused found dead in Keesara tahsildar graft case
Author
Hyderabad, First Published Jun 20, 2022, 7:02 PM IST


హైదరాబాద్: Keesara  Tahsildar అవినీతి కేసులో మూడో నిందితుడు Kandadi. Srikanth Reddyఅనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఇంట్లోనే శ్రీకాంత్ రెడ్డి మరణించాడు.  ఈ ఘటన kushaiguda పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం నాడు చోటు చేసుకొంది.  కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని Nagarjuna Nagar కాలనీకి చెందిన కందాడ శ్రీకాంత్ రెడ్డి వ్యాపారం చేస్తుంటాడు.  శ్రీకాంత్ రెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. శ్రీకాంత్ రెడ్డి మద్యానికి బానిసగా మారాడు.  దీంతో Liquor సేవిస్తూ భార్యతో గొడవకు దిగేవాడు. దీంతో పిల్లలను తీసుకొని భార్య తన పుట్టింటికి వెళ్లింది. మరో వైపు తల్లితో కూడా శ్రీకాంత్ రెడ్డి గొడవ పడుతున్నాడని పోలీసులు చెప్పారు. ఈ గొడవ భరించలేక తల్లి నాగారంలోని కూతురు ఇంటికి వెళ్లింది. 

శ్రీకాంత్‌రెడ్డి తండ్రి ధర్మారెడ్డి మాజీ తహసీల్దార్‌ Nagaraju అవినీతికి పాల్పడ్డ కేసులో మూడు నెలల పాటుగాJail  శిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలై మరుసటి రోజే వాసవిశివనగర్‌ కాలనీలోని శివాలయంలో చెట్టుకు ఉరి వేసుకొని అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. Dharma Reddy.  తాజాగా ధర్మారెడ్డి కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి అనుమానాస్పదస్థితిలో మృతిచెందడం స్థానికంగా చర్చకు దారి తీసింది. 

అసలు ఏం జరిగిందంటే....

భూరికార్డులు మార్చేందుకు రూ.2 కోట్లు లంచం అడిగి, ముందస్తుగా రూ.1.10 కోట్లు తీసుకుంటూ 2020, ఆగస్టు 14న  అప్పటి కీసర  తహసీల్దార్‌ నాగరాజుతోపాటు రియల్టర్లు Anji Reddy , Srinath Yadav, వీఆర్‌ఏ Sai Raju  ఏసీబీకి పట్టుబడ్డారు. నాగరాజు వ్యవహారాలపై ACB ఆరాతీసింది.  ధర్మారెడ్డితో కలిసి అక్రమాలకు పాల్పడినట్టు మరో ఉదంతం వెలుగుచూసింది. రాంపల్లి దయారాలోని 93 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు యత్నించారన్న ఆరోపణలతో ధర్మారెడ్డి, అతని కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి, ఇద్దరు రియల్టర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్‌ సెప్టెంబర్‌లో అరెస్టయ్యారు. ధర్మారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డితో కలిసి నకిలీ పత్రాలు, అక్రమ పాస్‌ పుస్తకాలు సృష్టించినట్టు ఏసీబీ గుర్తించింది. దీంతో నాగరాజుపై రెండో కేసును నమోదు చేసింది ఏసీబీ.

ఏసీబీ కస్టడీలో ఉండగానే అక్టోబర్‌ 14న చంచల్‌గూడ జైలులో నాగరాజు Suicide చేసుకున్నాడు. ధర్మారెడ్డికి వయసు దృష్ట్యా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలై మరుసటి రోజే అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు నిందితులు బలవన్మరణాలకు పాల్పడడంతో అప్పట్లో సంచలనం రేపింది. తాజాగా మరో నిందితుడు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది.

Follow Us:
Download App:
  • android
  • ios