నిజామాబాద్ జిల్లాలో (nizamabad district) దొంగలు రెచ్చిపోయారు. జిల్లాలోని దర్పల్లి మండల కేంద్రంలో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఇండియన్ ఆయిల్ బంక్‌లోకి (indian oil bunk) దొంగలు చొరబడ్డారు. కర్రలు రాళ్లతో బంక్‌పై కూడా దాడికి తెగబడ్డారు. అనంతరం లోపలికి చొరబడి క్యాష్ కౌంటర్ (robbery) ఎత్తుకెళ్లారు.
నిజామాబాద్ జిల్లాలో (nizamabad district) దొంగలు రెచ్చిపోయారు. జిల్లాలోని దర్పల్లి మండల కేంద్రంలో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఇండియన్ ఆయిల్ బంక్‌లోకి (indian oil bunk) దొంగలు చొరబడ్డారు. గుంపుగా బంక్ వెనుక గోడ దూకి లోపలికి వచ్చారు. మరికొందరు బంక్ ముందు కాపలా ఉండగా ఇద్దరు బంక్‌లోకి వెళ్లి సిబ్బందిపై దాడి చేశారు. కర్రలు రాళ్లతో బంక్‌పై కూడా దాడికి తెగబడ్డారు. అనంతరం లోపలికి చొరబడి క్యాష్ కౌంటర్ (robbery) ఎత్తుకెళ్లారు. వీరి ధాటికి భయపడిన సిబ్బంది అక్కడి నుంచి పరుగులు తీశారు.
దీనిపై పోలీసులకు, బంక్ యజమానికి సమాచారం అందించారు. దర్పల్లి సీఐ శ్రీశైలం సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దీనిలో భాగంగా పోలీసులు బంక్ పరిసర ప్రాంతాల్లో తనిఖీ చేయగా.. కొద్దీ దూరంలో క్యాష్ కౌంటర్ కనిపించింది. దానిని స్వాధీనం చేసుకొని పరిశీలించగా లోపల రూ.21 వేల క్యాష్ ఉందని అధికారులు తెలిపారు. అయితే అందులో రూ.40 వేలు ఉండాలని సిబ్బంది చెబుతున్నారు.
