హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. దొంగతనానికి వచ్చిన ఓ దొంగ ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. ఛత్రినాక పీఎస్ పరిధిలోని రామస్వామి గంజ్‌లో ఓ ఇంట్లో మోటారు దొంగతనానికి వచ్చిన దొంగ ప్రమాదవశాత్తూ నీటి సంపులో పడిపోయాడు.

దీంతో బయటికొచ్చేందుకు నానా తంటాలు పడి ఊపిరాడక మృత్యువాత పడ్డాడు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. మృతుడిని చిత్తు కాగితాలు ఏరుకునే సతీశ్‌గా గుర్తించారు.