తెలంగాణ సీఎం కేసీఆర్ ఎట్టకేలకు అసెంబ్లీని రద్దుచేసి ముందస్తుకు సిద్దమయ్యారు. ముందస్తు ఎన్నికలకు అందరికంటే ముందస్తుగానే అభ్యర్థులను కూడా ప్రకటించారు.   మొత్తంగా 105 నియోజకవర్గాలకు టీఆర్ఎస్ తరపున పోటీ చేయనున్న అభ్యర్థులను సీఎం ప్రకటించారు. అయితే ఈ అభ్యర్థుల్లో చాలా మంది గతంలో ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యేలుగా గెలిచి గెలిచి టీఆర్ఎస్ లో చేరారు. ఈ క్రమంలో మరోసారి వారికే టికెట్లు ఖరారు చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు.

ఇలా పార్టీ మారి టీఆర్ఎస్ టికెట్ పొందిన ఎమ్మెల్యేలు వీరే...

అశ్వరావుపేట-తాటి వెంకటేశ్వర్లు 

ఇల్లందు-కనకయ్య

 ఖమ్మం-పువ్వాడ అజయ్ కుమార్
 
వైరా-బానోతు మదన్‌లాల్
 
డోర్నకల్- రెడ్యానాయక్

పరకాల-చల్లా ధర్మారెడ్డి
 
పాలకుర్తి-ఎర్రబెల్లి దయాకర్‌రావు
 
మిర్యాలగూడ-ఎన్.భాస్కరరావు
 
దేవరకొండ-రవీంద్రకుమార్
 
సిర్పూర్ కాగజ్‌నగర్-కోనేరు కోనప్ప

నిర్మల్-అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి
 
మక్తల్-చిట్టెం రామ్మోహన్‌రెడ్డి 
 
మహేశ్వరం- తీగల కృష్ణారెడ్డి

ఇబ్రహింపట్నం- మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి

శేరిలింగంపల్లి- అరికెపూడి గాంధీ
 
చేవెళ్ల- కాలె యాదయ్య

కుత్బుల్లాపూర్‌- వివేకానంద

కూకట్‌పల్లి- మాధవరం కృష్ణారావు
 
 సనత్‌ నగర్‌- తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

కంటోన్మెంట్‌- సాయన్న

జూబ్లీహిల్స్‌- మాగంటి గోపినాథ్‌
 
రాజేంద్రనగర్‌- ప్రకాష్‌ గౌడ్‌