Asianet News TeluguAsianet News Telugu

నేతల మధ్య విభేదాలున్నాయ్.. వెంటనే సయోధ్య కుదర్చాలి- టీ కాంగ్రెస్ పరిస్థితిపై హైకమాండ్ కు దిగ్విజయ్ నివేదిక

టీ కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న విభేదాలు పార్టీకి నష్టం కలిగిస్తాయని, వాటిని వీలైనంత తొందరగా సరి చేయాలని హైకమాండ్ కు దిగ్విజయ్ సింగ్ సూచించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇలాంటి పరిణామాలు ఇతర పార్టీలకు లాభం చేకూరుస్తాయని తెలిపారు. 

There are differences between the leaders.. Reconciliation should be done immediately- Digvijay's report to the High Command on the condition of T Congress
Author
First Published Dec 26, 2022, 9:19 AM IST

టీ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు నెలకొన్నాయని, ఇవి పార్టీకి మరింత నష్టం చేకూరుస్తున్నాయని ఏఐసీసీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అభిప్రాయపడ్డారు. వీరి మధ్య వెంటనే సయోధ్య కుదర్చాల్సిన అవసరం ఉందని, ఇక ఆలస్యం చేయకుండా ఈ దిశగా ప్రయత్నాలు చేపట్టాలని సూచించారు. ఈ మేరకు ఆయన హైకమాండ్ కు అందించేందుకు ఓ నివేదికను సిద్ధం చేశారు. 

తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య ఏర్పడిన వివాదాలకు పరిష్కారం చూపేందుకు, పార్టీని గాడిలో పెట్టే బాధ్యతను హైకమాండ్ దిగ్విజయ్ సింగ్ కు బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన తెలంగాణకు చేరుకున్నారు. రెండు రోజుల పాటు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేశారు. వారితో చర్చించారు. టీ కాంగ్రెస్ లో నెలకొన్న సమస్యలపై ఓ అవగాహనకు వచ్చి, దానిని పరిష్కరించాలంటే చేపట్టాల్సిన చర్యలపై ఓ నివేదికను సిద్ధం చేశారు. దానిని త్వరలోనే అధిష్టానానికి అప్పగించాలని భావిస్తున్నారు.

చైనా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్.. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాల పంపిణీ..

రాష్ట్ర కాంగ్రెస్ పై పూర్తి అవగాహన ఉన్న దిగ్విజయ్ సింగ్.. ఈ నివేదికను అధిష్టానానికి అప్పగించిన తరువాత సీనియర్ నాయకులతో సమావేశం కానున్నారని తెలుస్తోంది. అందులో కాంగ్రెస్ కొత్త జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ తో ఉండే అవకాశం ఉంది. వారికి ఇక్కడి పరిస్థితులను నేరుగా వివరించనున్నారు. దీని తరువాత హైకమాండ్ చర్యలకు పూనుకుంటుందని తెలుస్తోంది. అయితే ఈ నివేదిక ఫైనల్ చేసే ముందు దిగ్విజయ్ సింగ్ మాణికం ఠాకూర్, రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ నాయకులతో మాట్లాడారు.

దిగ్విజయ్ సింగ్ పరిశీలనలతో ఏం తేలిందంటే ?

టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి, ఇతర సీనియర్ నాయకులకు మధ్య కొంత కాలం నుంచి విబేధాలు ఏర్పడ్డాయి. ఇలా నాయకుల మధ్య విభేదాలు పార్టీకి నష్టం కలిగిస్తోంది. ఇది కింది స్థాయి లీడర్లలో, కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తిని మిగిలిస్తోంది. దీని వల్ల పార్టీపై వారికి ఒక నెగిటివ్ అభిప్రాయం ఏర్పడింది. అందుకే తమ రాజకీయ భవిష్యత్తు కోసం వారు పార్టీలు మారుతున్నారు. ఈ పరిస్థితి మరి కొంత కాలం పాటు ఇలాగే కొనసాగితే టీ కాంగ్రెస్ కు ఎన్నో ఇబ్బందులు వస్తాయని దిగ్విజయ్ సింగ్ ఒక అభిప్రాయానికి వచ్చారు. 

బస్సులో పర్సు పోగొట్టుకుంది.. అదే ఆమె ప్రాణాలు కాపాడింది..

గత అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డికి, ఇతర సీనియర్ నాయకులకు విబేధాలు మొదలయ్యాయి. కానీ ఆయన టీపీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక ఇవి మరింత ఎక్కువయ్యాయి. ఆయన టీ కాంగ్రెస్ కు అధ్యక్షుడు కావడం చాలా మంది సీనియర్లకు ఇష్టం లేదు. కానీ హైకమాండ్ నిర్ణయాన్ని కాదనలేక, ఇటు అడ్జెస్ట్ కాలేక వారంతా సతమతమవుతున్నట్టు దిగ్విజయ్ సింగ్ గమనించారు. ఈ విషయం పలువురు సీనియర్ నాయకులు స్వయంగా ఆయనకు తెలియజేశారు. ఇక్కడి పరిస్థితులన్నింటినీ గమనించిన దిగ్విజయ్ సింగ్.. వీటికి పరిష్కారాలు చూపేందుకు ఐదు అంశాలతో ఓ నివేదికను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. 

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కు ఏఐసీసీ ఇన్ ఛార్జిగా మాణికం ఠాకూర్ కొనసాగుతున్నారు. ఆయనపై కూడా సీనియర్లకు అసంతృప్తి ఉంది. ఠాకూర్.. రేవంత్ రెడ్డి మాటే వింటారని, ఆయనకు అనుకూలంగానే ఉంటారని సీనియర్లు అనుకుంటున్నారు. తమ సూచనలను పట్టించుకోరని భావిస్తున్నారు. దీనిపై హైకమాండ్ ఫోకస్ చేయాలి. మరో సీనియర్ నాయకుడిని ఇన్ ఛార్జిగా పెట్టాలి. 

అసెంబ్లీ ఎనికలకు దగ్గరకు వస్తున్నాయి. దీని కోసం అన్ని పార్టీలు ఇప్పటికే వ్యూహాలు, దానికి ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో నాయకుల మధ్య ఉన్న విభేదాలు పార్టీకి నష్టం చేకూరుస్తాయి. వీటి వల్ల ఇతర పార్టీలు లాభం పొందుతాయి. కాబట్టి ఈ విషయంలో హైకమాండ్ వెంటనే కలుగజేసుకొని, నాయకుల మధ్య విభేదాలు తొలగించాలి. 

గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం.. 4 కార్లు, 2 బైక్ల మీదికి దూసుకెళ్లిన టిప్పర్.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు..

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు తామే బీజేపీయే ప్రత్యామ్నాయం అని చెప్పాలని చూస్తోంది. ఈ విషయంలో కాంగ్రెస్ అలెర్ట్ కావాలి. లీడర్లంతా కలిసిమెలిసి ఉండాలి. పార్టీని మరింత క్షేత్ర స్థాయికి తీసుకెళ్లాలి. పలు కార్యక్రమాలు చేపట్టాలి. భారత్ జోడో యాత్ర తెలంగాణలో సక్సెస్ అయ్యింది. నాయకుల్లో ఉత్సాహం నెలకొంది. కానీ తరువాత జరిగిన పరిణామాలు పార్టీకి నష్టం చేకూర్చాయి. వీటిని పూడ్చేందుకు హైకమాండ్ వెంటనే దృష్టి సారించాల్సిన అవసరం ఉందని దిగ్విజయ్ సింగ్ తన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios