హైదరాబాద్‌లో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఇంట్లోనే చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో రూ.3 లక్షల నగదు, 3.5 లక్షల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు ఆమె తెలిపారు.

ఈ మేరకు మంగళవారం బంజారాహిల్స్‌ పోలీసులకు రేణుకా చౌదదరి ఫిర్యాదు చేశారు. ఇంట్లో పనిచేసే ముగ్గురు వ్యక్తులను అనుమానిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పనిమనుషులందరినీ విచారించిన తర్వాతే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రేణుకా చౌదరి తెలిపారు.