బీజేపీ మీద కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు.. వాట్సాప్ యూనివర్సిటీలో శిక్షణ పొందితే ఇలాగే ఉంటుంది.. అని సెటైర్..

బీజేపీ మీద కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు వేశారు. ప్రజాస్వామ్య పోరాట చరిత్ర లేని పార్టీ బీజేపీ అంటూ ఎద్దేవా చేశారు. వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకుంటే ఇలాగే ఉంటుందని సెటైర్ వేశారు.

The side affects of being coached at WhatsApp university.. minister ktr satires on BJP

హైదరాబాద్ : వాట్సాప్ యూనివర్సిటీ మీద రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాష్ట్రావతరణ వేడుకల నిర్వహణ సందర్భంగా బీజేపీ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ లో అల్లూరి సీతారామరాజు ఫొటోను ఉంచారు. ఈ ఫొటోలను అమిత్ షా, కిషన్ రెడ్డి తిలకించారు. ఈ ఫోటోను టీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ ట్వీట్ చేశాడు. దాన్ని కేటీఆర్ షేర్ చేస్తూ.. వాట్సాప్ యూనివర్సిటీలో శిక్షణ పొందడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఇవే అని సెటైర్ విసిరారు. 

ప్రజాస్వామ్య పోరాట చరిత్ర లేని పార్టీ బీజేపీ అని కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. భారత దేశ స్వాతంత్ర్య పోరాటంలోనూ, తెలంగాణ ఏర్పాటులోనూ ఆ పార్టీ పాత్ర లేదన్నారు. ఆ పార్టీ ఏకైక బలం అబద్దాలు మాట్లాడటం, దాడులు చేయడమేనని కేటీఆర్ చెప్పారు. 

 

కాగా, బుధవారం నాడు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్లలో Telangana Formation day  వేడుకల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ.. చేనేత కార్మికులకు నిరంతరం పని కల్పించేందుకే బతుకమ్మ చీరల తయారీకి సిరిసిల్ల నేత కార్మికులకే ఆర్డర్ ఇచ్చినట్టుగా మంత్రి చెప్పారు. రంజాన్, క్రిస్మస్ పండుగలకు కూడా ప్రభుత్వం ఇచ్చే చీరలకు కూడా రాజన్న సిరిసిల్ల నేత కార్మికులే తయారు చేస్తున్నారన్నారు. 

సిరిసిల్లాలోని సుమారు 15వేలకు పైగా నేత కార్మికులు ప్రతి నెల రూ. 16 వేల వేతనాలను పొందుతున్నారని మంత్రి గుర్తు చేశారు. నేత కార్మికులకు ప్రతిరోజూ పని కల్పించే ఉద్దేశ్యంతోనే చీరల తయారీని సిరిసిల్ల కార్మికులకు అప్పగించామన్నారు. మరమగ్గాల పరిశ్రమ అభివృద్ధికి తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని కూడా కేటీఆర్ వివరించారు. ఇక, తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ.. వ్యవసాయానికి దేశంలో ఏ రాష్ట్రం, ఏ నాయకుడూ ఇవ్వని ప్రాధాన్యత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చారని కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ప్రబుత్వం కర్షక ప్రభుత్వమని కేటీఆర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని స్థూపానికి నివాళి అర్పించిన తరువాత కేటీఆర్ కలెక్టరేట్ ఆవరణలో జెండా ఎగురవేశారు. ఆ తరువాత మాట్లాడుతూ.. తెలంగాణలో హరిత విప్లవారిని ముఖ్యమంత్రి కేసీఆర్ తెరలేపారని అన్నారు. ఎండాకాలంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో మత్తల్లు దూకించిన ఘటన సీఎం కేసీఆర్ దే అన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios