Actor Suman: ఇండియన్ ఆర్మీకి సుమన్ 117 ఎకరాల భూమిని విరాళం ఇచ్చినట్టు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దానికి ఆయన స్పందించారు. వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు. వాటిని నమ్మవద్దని అన్నారు. 

Actor Suman: ఇండియన్ ఆర్మీకి టాలీవుడ్ సీనియర్ హీరో సుమన్ 117 ఎకరాల భూమిని విరాళం ఇచ్చినట్టు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దానికి ఆయన స్పందించారు. సుమన్ భారత రక్షణ దళానికి విరాళం అందించలేదు. భార‌త‌ ఆర్మీకి తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా 117 ఎకరాల భూమిని సుమన్ విరాళంగా అందించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని సుమన్ స్వయంగా ప్రకటించారు.

సుమన్ మాట్లాడుతూ "సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నటువంటి వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు. వాటిని నమ్మవద్దు. ఆ భూమికి సంబంధించి వివాదం కోర్టులో కొనసాగుతోంది. వివాదానికి పరిష్కారం లభించిన వెంటనే... వ్యక్తిగతంగా నేనే అందరికీ తెలియజేస్తాను. దానికి సంబంధించి ఏ విషయమైనా నేనే చెబుతా అంటూ చెప్పుకొచ్చారు.

సినీ నటుడు, స్టార్ హీరో సుమన్ ఇండియన్ ఆర్మికి 117 ఎకరాల భూమిని సుమన్ విరాళంగా అందజేశారనీ, యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రానికి అతి సమీపంలోని 117 ఎకరాల భూమిని ఇండియన్ ఆర్మికి విరాళంగా ఇచ్చారనీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా అందజేశారనీ, సుమన్ విరాళంగా ప్రకటించిన వాటి విలువ 30కోట్లకు పైగానే ఉంటుందని, సుమన్ చేసిన మంచి పనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే ఆయనకు సంబంధించిన ఫొటోలు కూడా షేర్ చేసుకుంటూ సుమన్ రియల్ ఇండియన్ హీరో అంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జోరుగా ప్ర‌చారం సాగిన‌ విష‌యం తెలిసిందే.