కుమారుడి పేరు మీదకు భూమి రాసి ఇవ్వాలని బలవంత పెడుతోందని తాగిన మైకంలో భార్యను కొట్టి చంపాడు. అయితే దీనిని యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తే నేరం తనపైకి రాదనే ఉద్దేశంతో మృతదేహాన్ని తీసుకెళ్లి వేరే చోట పెట్టాలనుకున్నాడు. కానీ స్థానికులు చూడటంతో దొరికపోయాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల పరధిలో చోటు చేసుకుంది.
వారిద్దరూ దంపతులు. గత కొన్ని రోజులుగా ఆస్తి విషయంలో వారిద్దరికీ గొడవలు అవుతున్నాయి. ఈ క్రమంలోనే రెండు రోజుల కిందట కూడా గొడవ జరిగింది. అయితే తాగిన మైకంలో ఉన్న భర్త భార్యను తీవ్రంగా కొట్టారు. దీంతో ఆమె చనిపోయింది. దీనిని యాక్సిడెంట్ (accident)గా చిత్రీకరిస్తే శిక్ష నుంచి తప్పించుకోవచ్చని భావించి మృతదేహాన్ని తీసుకెళ్లి ట్రాక్టర్ (tractor)లో వేసుకొని తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే దగ్గర ఉంచాలని అనుకున్నాడు. అయితే దీనిని స్థానికులు గమనించడంతో అతడు దొరికిపోయాడు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట (siddipet) జిల్లాలోని అక్కన్నపేట (akkannapet) మండలం పంతులుతాండ (pantulu thandaలో జాతోటు స్వామి (jathotu swami), మణెమ్మ (45) (manemma) దంపతులు జీవిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు శ్రీకాంత్ (srikanth)ఉన్నాడు. స్వామికి గతంలోనే రెండు పెళ్లిల్లు జరిగాయి. మణెమ్మ మూడో భార్య. ఇద్దరు భార్యలను వివిధ కారణాలతో గతంలోనే వదిలేశాడు. ప్రస్తుతం వీరికి ఉన్న భూమిలో ఆయన వ్యవసాయం చేస్తున్నాడు. మణెమ్మ కూడా కూలీ పనులు చేస్తుంటుంది. కుమారుడు చదువుకుంటున్నాడు. ఈ మధ్య స్వామి ఓ ట్రాక్టర్ కొని దానిని నడుపుతూ ఆదాయం సంపాదిస్తున్నాడు.
అయితే రెండో భార్యకు కూతురు స్వాతి ఉంది. ఆమెకు పెళ్లి చేశాడు. పెళ్లి సమయంలో రూ.5 లక్షలు కట్నంగా అందజేశారు. స్వామి పేరుపై 5 ఎకరాల భూమి ఉండగా.. అందులో నుంచి ఒక ఎకరం భూమిని కూతురు పేరుపై రాశాడు. ఈ విషయం మణెమ్మకు తెలిసింది. దీంతో తరచూ ఇద్దరి మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ద మనుషుల ఆధ్వర్యంలో పంచాయితీ కూడా జరిగింది. ఇందులో ఒక ఎకరం భూమిని కుమారుడి పేరుపై రాయాలని పెద్దలు తేల్చారు. కానీ దీనికి స్వామి ఒప్పుకోలేదు. మళ్లీ గొడవలు జరగడం ప్రారంభించాయి.
ఈ క్రమంలో బుధవారం రాత్రి చుట్టు పక్కల ఉన్న కాలనీ వాసులు అంతా సమ్మక్క, సారలమ్మ (sammakka, saralamma) జాతర ప్రాంతానికి వెళ్లారు. ఆస్తి విషయంలో మళ్లీ ఇద్దరు దంపతుల మధ్య గొడవ మొదలైంది. మద్యం సేవించి వచ్చిన స్వామి.. కోపంతో మణెమ్మను కొట్టాడు. ఆపే ప్రయత్నం చేస్తున్న ఆమెను పక్కకు తోసేశాడు. దీంతో ఆమె తల బలంగా వెళ్లి గోడకు తగిలింది. తలకు దెబ్బ తగలడం వల్ల ఆమె అక్కడే మృతి చెందింది. అయితే దీనిని యాక్సిడెంట్ (accident) గా చిత్రీకరించాలని అనుకున్నాడు. రాత్రి సమయంలోనే మృతదేహాన్ని తీసుకొని ట్రాక్టర్ లో ఉంచాడు. ట్రాక్టర్ తీసుకొని ఆ ప్రాంతంలో రెగ్యులర్ గా అధికంగా ప్రమాదాలు జరిగే చోటైన అక్కన్నపేట మెయిన్ రోడ్ వద్దకు తీసుకొచ్చాడు. అక్కడ మృతదేహాన్ని వేసేందుకు ప్రయత్నిస్తుండగానే స్థానికులు గమనించారు. ఈ విషయాన్ని వారు పోలీసులకు చెప్పారు. పోలీసులు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఉదయం ఘటన స్థలాన్ని ఏసీపీ సతీష్ (acp sathish)తో పాటు ఇతర పోలీసులు పరిశీలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
