తన భార్యతో కలిసి జాతరకు వెళ్లాలి అనుకున్నాడు ఆ భర్త. ఇదే విషయం తన భార్యకు తెలియజేశాడు. కానీ దీనికి భార్య ఒప్పుకోలేదు. తాను జాతరకు రానని చెప్పింది. దీంతో మనస్థాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
కొందరు చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా మానసిక సంఘర్షణకు గురవుతారు. తీవ్రంగా కలత చెందుతారు. చివరికి ఆ మానసిక ఆందోళనలో ఆత్మహత్య చేసుకుంటారు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. చిన్న విషయానికే ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
భార్య జాతరకు రాలేదని ఓ భర్త ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకరం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా అలంపూర్ (alampur) మండలంలోని అయిజ (aija)కు చెందిన వీరేశ్ (viresh) (33) సుజాత (sujatha) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. భర్త వీరేశ్ హైదరాబాద్ (hyderabad) పట్టణంలో ఓ మిమిక్రీ ఆర్టిస్టు (mimicry artist) గా పని చేస్తున్నాడు. అయితే అయిజ (aija) లో జరిగే జాతరకు వెళ్దామని భార్య సుజాతను భర్త వీరేశ్ కోరాడు. కానీ దీనికి భార్య ఒప్పుకోలేదు. ఈ విషయానికి విరేశ్ తీవ్రంగా మనస్థాపం చెందాడు. శనివారం రోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు హాస్పిటల్ (hospital) కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతుండగానే పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా.. ఆదివారం హైదరాబాద్ లో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. తేజావత్ రాజు (30) సింగం చెరువు తండాలో నివాసం ఉంటున్నాడు. ఆయన ప్రస్తుతం మహేశ్వరం పోలీస్ స్టేషన్‌లో (Maheswaram police station) కానిస్టేబుల్‌గా విధులు నిర్వరిస్తున్నారు. అయితే రోజులాగే శనివారం పోలీస్ స్టేషన్‌లో విధులు ముగించుకొని ఇంటికి వచ్చాడు. అయితే ఏమయ్యిందో ఏమో కానీ ఆదివారం ఉదయం తల్లిదండ్రులకు ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
