Asianet News TeluguAsianet News Telugu

పనిచేయని మంత్రం: పరిపూర్ణాననంద భవిష్యత్తు ఏమిటి?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో బీజేపీది చావు తప్పి కన్నులొట్టబోయిన పరిస్థితిలా తయారైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ కీ రోల్ పోషిస్తుందని, బీజేపీ దాదాపు 7నుంచి పది సీట్లతో తన సత్తా చాటుతుందంటూ బీజేపీ ఆశలు పెట్టుకుంది. 

The future of Paripoornanand in dilemna
Author
Hyderabad, First Published Dec 15, 2018, 3:30 PM IST

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో బీజేపీది చావు తప్పి కన్నులొట్టబోయిన పరిస్థితిలా తయారైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ కీ రోల్ పోషిస్తుందని, బీజేపీ దాదాపు 7నుంచి పది సీట్లతో తన సత్తా చాటుతుందంటూ బీజేపీ ఆశలు పెట్టుకుంది. 

కానీ ఫలితాలు మాత్రం రివర్స్ అయ్యాయి. బీజేపీ ఈ ఎన్నికల ఫలితాలతో ఎక్కడో ఉంటుందని భావించి ఫలితాలతో ఒక్కసారిగా చతికిలబడింది. గత ఎన్నికల్లో సాధించిన సీట్లను సైతం కోల్పోయి ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

ముందస్తు ఎన్నికల్లో బీజేపీకి అనుకూల స్థానాలు వస్తాయని భావించించింది. అందుకే మాంచి జోష్ తో ముందుకు వెళ్లింది. ఈ విషయాన్ని తెలంగాణ బీజేపీ నాయకులే కాదు జాతీయ నాయకులు సైతం నమ్మారు. కాబట్టే ఎన్నికల ప్రచారంలో విరిగా పాల్గొన్నారు. 

ప్రధాని నరేంద్రమోదీ దగ్గర నుంచి మెుదలు పెడితే పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీల వరకు తెలంగాణలో తిష్ట వేశారు. ఎంతమంది వచ్చి ఎంత ప్రచారం చేస్తే ఏం లాభం. 

ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గతంలో లేని విధంగా ఈసారి తుడిచిపెట్టుకుపోయింది. రాష్ట్రం మొత్తంమీద ఒకే ఒక స్థానం దక్కించుకుని పరువు పోగొట్టుకుంది. తెలంగాణ బీజేపీ అనే స్థాయి నుంచి తెలంగాణాలో బీజేపీ ఉందా అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యే స్థాయికి పడిపోయింది. ఉత్పన్నమైన పరిస్థితికి చేరుకుంది. 

తెలంగాణలో బీజేపీ ఫలితాలు జాతీయ నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి ఎలాంటి ప్రభావం చూపాయో తెలియదు కానీ పరిపూర్ణానంద స్వామిజీకి మాత్రం షాక్ ఇచ్చాయనే చెప్పాలి. బీజేపీ అధికారంలోకి వస్తే తానే సీఎం అవుతానంటూ ఫీల్ అయిన ఆయన ఫలితాలను చూసి లబోదిబోమంటున్నారు. 

2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో బీజేపీ స్టార్ క్యాంపెనర్ గా పరిపూర్ణానంద స్వామీజి వ్యవహరించారు. బీజేపీ అంటే మతతత్వ పార్టీ అంటూ ప్రచారం ఉంది. అలా పరిపూర్ణానంద ప్రచారంతో తెలంగాణలోని హిందువులు, తన భక్తులు బీజేపీకి ఓట్లు గుద్దుతారని తాను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మోగి ఆదిత్యనాథ్ లా సీఎం అయిపోవచ్చని కలలు కన్నారు. కానీ ఆయన ఆశలు ఆడియాసలు అయ్యాయి. స్టార్ కాంపైనర్ కు స్టార్ లేకుండా చేశాయి. 

అయితే ఎన్నికల ఫలితాలు వెలువడటం, బీజేపీ ఒక్కస్థానానికే పరిమితం కావడంతో మరి స్టార్ కాంపైనర్ ఏం చేస్తారా అన్నదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పుడు పరిపూర్ణానంద స్వామి ఏం చేయబోతున్నారనే అంశం ఆసక్తి రేపుతోంది. 

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే తెలంగాణలో బీజేపీ ఉన్న ఒక విధంగా లేనట్టే అన్న భావన కలుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ స్టార్ క్యాంపెనర్ గా చెప్పుకున్న పూరిపూర్ణానంద రాజకీయాల్లో కొనసాగుతారా లేక తిరిగి తాను నమ్ముకొన్న ఆధ్యాత్మికం వైపు వెళుతారా అన్న చర్చ జోరుగా సాగుతోంది. 

యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తో పోలిస్తే తనకేం తక్కువ అనుకున్నారే ఏమోగానీ పరిపూర్ణానంద స్వామి బీజేపీలో చేరారు. బీజేపీలో చేరడమే కాదు ఆ పార్టీలో తానేదో అనుకునేవారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ పక్కన కూర్చోని పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. 30రోజుల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తానని అమిత్ షాకు మాటిచ్చానని పరిపూర్ణనంద పదేపదే చెప్పుకునేవారు.

పరిపూర్ణనంద కాన్ఫిడెన్స్ చూసి ఇతర పార్టీల నేతలే కాదు తెలంగాణ బీజేపీ నేతలు సైతం బిత్తరపోయారు. తానే నెక్ట్స్ సీఎం అన్నంత హడావిడి చేశారు. ఒక ఎలక్ట్రానిక్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైతం 30రోజుల్లో బీజేపీకి 70 సీట్లు సాధించి పెడతానని సవాల్ చేశారు. 

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చాలానే కష్టపడ్డారు పరిపూర్ణానంద స్వామి. తెలంగాణలో విస్తృతంగా పర్యటించారు. తీరా ఎన్నికల ఫలితాలు చూస్తే ఘోరంగా వచ్చాయి. 118 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తే ఒక గోషామహాల్ మినహా ఎక్కడా గెలుపొందలేదు. 100 స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేదు. 

పరిపూర్ణనంద స్వామి విస్తృతంగా పర్యటించినా బీజేపీకి సీట్లు పెరగకపోవడం సరికదా ఉన్న సీట్లే కోల్పోయింది. ఇప్పటి వరకు ఉన్న శాసన సభ్యులతో తెలంగాణలో బీజేపీకి కొంతబలం ఉందని పార్టీ అగ్రనాయకత్వం ఆశపడేది. తెలంగాణలో ఆరెస్సెస్ లాంటి హిందూ సంస్థలు కిందిస్థాయిలో ఉండటం తమకు కలిసి వస్తుందని ఆశించినా ఫలితం రాలేదు. 

ఎన్నికల ఫలితాల అనంతరం పరిపూర్ణానంద సైలెంట్ అయ్యారు. మరీ పరిపూర్ణానంద తనకెందుకు ఈ రాజకీయాల లొల్లి అంటూ ఆధ్మాత్మిక వైపు వెళ్లి ప్రవచనాలు చెప్పుకుంటారా లేక ఇక వెనకడుగు వేసేది లేదంటూ మరింత ఉత్సాహంతో ఏపీ రాజకీయాల్లో అడుగుపెడతారో వేచి చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios