Asianet News TeluguAsianet News Telugu

రూ. 5 కోట్ల ఆస్తినష్టం: ఎలుకే కారణమని తేల్చిన ఫోరెన్సిక్ బృందం

హైద్రాబాద్ ముషీరాబాద్ లోని మారుతి సర్వీసింగ్ సెంటర్ లో అగ్ని ప్రమాదానికి ఓ ఎలుక కారణమైంది. ఈ విషయాన్ని ఫోరెన్సిక్ బృందం తేల్చింది.

The fire accident at maruti servicing center caused due to rat in hyderabad
Author
Hyderabad, First Published Aug 21, 2020, 4:50 PM IST


హైదరాబాద్:  హైద్రాబాద్ ముషీరాబాద్ లోని మారుతి సర్వీసింగ్ సెంటర్ లో అగ్ని ప్రమాదానికి ఓ ఎలుక కారణమైంది. ఈ విషయాన్ని ఫోరెన్సిక్ బృందం తేల్చింది.

ముషీరాబాద్ లో మారుతి సర్వీసింగ్ సెంటర్ లో ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో రూ. 5 కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగింది. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని తొలుత భావించారు.

సర్వీస్ సెంటర్ ఫస్ట్ ఫ్లోర్ లో మంటలు అంటుకొని నిమిషాల వ్యవధిలోనే మంటలు వ్యాపించాయి. ఫర్నీచర్ తో పాటు కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదంపై ప్రైవేట్ పోరెన్సిక్ టీమ్ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది.ఈ అగ్ని ప్రమాదానికి ఓ ఎలుక కారణంగా తేల్చింది. సీసీటీవీ దృశ్యాలను విశ్లేషిస్తే ఈ విషయం తేటతెల్లమైంది.

ఫిబ్రవరి 7వ  తేదీన ఉదయం సర్వీసింగ్ సెంటర్ లో ఉద్యోగులు పూజ చేశారు. విధులు ముగించుకొని రాత్రి పూట ఉద్యోగులు సర్వీసింగ్ సెంటర్ ను మూసివేసి వెళ్లిపోయారు.

ఈ సర్వీస్ సెంటర్ లో ఉన్న ఓ ఎలుక వెలుగుతున్న దీపపు ఒత్తిని నోట కరచుకొని వెళ్తున్న క్రమంలో ఉద్యోగులు కూర్చొనే డెస్క్ వద్దకు వెళ్లింది. ఈ సమయంలో డెస్క్ వద్ద ఉన్న కుర్చీపై వెలుగుతున్న ఒత్తి పడింది. దీంతో మంటలు వ్యాప్తి చెందాయి.

ఈ విషయాన్ని ప్రైవేట్ ఫోరెన్సిక్ బృందం తేల్చింది.సీసీటీవీ పుటేజీ దృశ్యాలను కూడ ఫోరెన్సిక్ బృందం ఈ విషయాన్ని గుర్తించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios