కుమారులను బయపెట్టి దారిలో పెడదామనే ఉద్దేశంతో ఓ తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడిని హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. అయితే తండ్రి విషయంలో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆయనకు ఇద్దరు కుమారులు. ఇందులో కారుణ్య నియామకం కింద తండ్రి ఉద్యోగం పెద్ద కుమారుడికి ఇచ్చారు. దీంతో తండ్రి తన బాధ్యతలు తీరిపోయాయి హాయిగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నారు. కానీ ఆయన అనుకున్నట్టుగా జరగలేదు. ఉద్యోగం వచ్చిన పెద్ద కుమారుడు సరిగా విధులకు హాజరుకావడం లేదు. చిన్న కుమారుడ ఏ పని చేయకుండా ఖాళీగా ఉండటం చూసి మానసిక ఆందోళనకు గురయ్యాడు. ఒకరు ఖాళీగా ఉండటం, మరొకరు ఉద్యోగం ఉన్నా సరిగా విధులకు వెళ్లకపోవడంతో తండ్రి అసంతృప్తికి గురయ్యారు. ఈ విషయంలో ఇద్దరు కుమారులు, తండ్రికి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఇలా తండ్రికి, కుమారులకు గొడవలు జరుగుతున్నాయి. అయితే ఈ క్రమంలో మంగళవారం కూడా వారి ముగ్గురు మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో ఇద్దరు కుమారులను బెదిరిద్దామనుకొని ఆ తండ్రి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో వెంటనే తండ్రిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఈ గొడవలు, తండ్రి ఆత్మహత్య చేసుకోవడం చూసి తీవ్ర ఒత్తిడికి గురైన చిన్న కుమారుడు ఆత్మహత్య కు పాల్పడ్డాడు. అయితే అతడిని హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స అందించినా పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు.
ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. భద్రాద్రి కొత్తగూడెం (bhadradri kothagudem) జిల్లా మణుగూరు (manuguru) ప్రాంతంలోని పీవీ కాలనీ (pv colony)కి చెందిన సింగరేణి (singareni) మాజీ కార్మికుడి పేరు ఎస్కే యూసఫ్ (sk yusuf). ఈయనకు ఇద్దరు కుమారులు. ఒక కూతురు ఉన్నారు. అయిత తండ్రి ఉద్యోగం పెద్ద కుమాడైన సుభాని (subhani)కి ఇప్పించారు. ఇది రెండేళ్ల క్రితం జరిగింది. అయితే అతడు సరిగా డ్యూటీకి వెళ్లడం లేదు. అయితే చిన్న కుమారుడైన సాధిక్ (sadhik) (23) ఇంట్లోనే జాబ్ లేకుండా, ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు. కుమారుల ఇద్దరి పరిస్థితి ఇలా ఉండటంతో పలు మార్లు తండ్రి ఇద్దరినీ మందలించారు.
ఈ విషయంలో ముగ్గురికి కొంత కాలం నుంచి గొడవలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఎప్పుటి లాగే మామూలుగా మంగళవారం కూడా వారి మధ్య గొడవ జరిగింది. దీంతో కుమారులని బెదిరించి దారిలో పెట్టాలనుకొని తండ్రి యుసఫ్ గడ్డి మందు తాగాడు. ఇది గమనించిన కుమారులు, కుటుంబ సభ్యులు వెంటనే కొత్తగూడెంలోని ఓ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. తండ్రి ఇలా ఆత్మహత్యకు పాల్పడటం, తరచూ గొడవలు జరుగుతుండటంతో కుమారుడు సాధిక్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ మానసిక ఒత్తిడి భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు.దీంతో అతడు పురుగుల మందు తాగాడు. అయితే అతడిని హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అయితే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. సాధిక్ కు ఇంకా పెళ్లి కాలేదు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
