తెలంగాణలో ఎన్నిక సంఘం పర్యటన.. అక్టోబర్ లోనే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్..!
తెలంగాణలో ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరకు వస్తుండటంతో షెడ్యూల్ పై అంతటా చర్చ జరుగుతుంది. రాజకీయ నేతలు, ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు ఎలక్షన్ ఎప్పుడనే ఉత్కంఠ ఉంది.

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో షెడ్యూల్ పై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఎలక్షన్లు ఎప్పుడు జరుగుతాయని అటు పొలిటికల్ పార్టీలోనూ.. ఇటు అధికారులతో చర్చ నడుస్తోంది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ తన అభ్యర్థుల లిస్టు ప్రకటించగా.. మిగతా పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో అక్టోబర్ లోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటక రాగా.. ఈసారి అదేవిధంగా ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.
తాజాగా తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ పై కీలక ప్రకటన వెలువడింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబరు 10వతేదీ లోపు షెడ్యూలు విడుదలయ్యే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్ మొదటి వారంలో కేంద్ర ఎన్నికల కమిషన్ సభ్యులు తెలంగాణలో పర్యటించనున్నారు. వారి పర్యటన అనంతరం ఎన్నికల షెడ్యూలుపై ప్రకటన వెలువడే అవకాశమున్నట్టు ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు.
అక్టోబర్ మొదటి వారంలో అంటే.. అక్టోబరు 3 నుంచి 6వ తేదీ వరకు ఎన్నికల కమిషన్ సభ్యులు, ఇతర అధికారులు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మొదటి రోజు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో .. రెండో రోజు జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో.. మూడో రోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో విస్తృత సమావేశాలు నిర్వహిస్తారు. చివరిగా ఢిల్లీలో పూర్తి స్థాయి సమావేశం నిర్వహిస్తారు.
రాష్ట్రంలో కేంద్రం ఎన్నికల సంఘం అధికారులు పర్యటించిన అనంతరమే ఓ క్లారీటి రానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీసగఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఒకే సారి విడుదల కానున్నట్టు తెలుస్తోంది.
గతంతో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఆ ఏడాది(2018) అక్టోబరు 7నే ప్రకటించిన నేపథ్యంలో ఈసారి కూడా అక్టోబరు 10లోపే ఎన్నికల తేదీలపై క్లారిటీ వచ్చే అవకాశమున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.