2017-18 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం మొత్తం అప్పు రూ.1,40,523 కోట్లు చేరినట్లు ఆర్థిక మంత్రి ఈటెల వెల్లడించారు.
అప్పులతోనే అభివృద్ధి సాధ్యమని టీఆర్ఎస్ సర్కారు భావిస్తోంది. అందుకే బంగారు తెలంగాణ నిర్మాణానికి అప్పులే ఆసరాగా ముందుకు వెళుతోంది. దీంతో మూడేళ్లలోనే తెలంగాణ అప్పులు మూడున్నర రెట్లు పెరిగాయి.
తెలంగాణ ప్రభుత్వం తొలి బడ్జెట్ నాటికి రూ.22,134 కోట్లు అప్పు చేసింది.
రెండో బడ్జెట్ నాటికి రూ.38,996 కోట్లు, మూడో బడ్జెట్ నాటికి రూ.62,110 కోట్లుకు అప్పు పెరిగింది. అంటే మూడు సంవత్సరాలు నిండకుండానే తెలంగాణ అప్పు రెట్టింపు అయింది.
2017-18 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం మొత్తం అప్పు రూ.1,40,523 కోట్లు చేరినట్లు ఆర్థిక మంత్రి ఈటెల వెల్లడించారు.
దీనికి అదనంగా కొత్త ఆర్థిక సంవత్సరంలో ఇతర మార్గాల ద్వారా రూ.26,400 కోట్లను రుణంగా తీసుకోనున్నట్లు తెలిపారు.
అంటే మూడున్నరేళ్లలోనే తెలంగాణ ప్రభుత్వ అప్పులు 22, 134 కోట్ల నుంచి 1,40,523 కోట్లుకు రికార్డు స్థాయిలో పెరిగాయి.
ఈ అప్పును రాష్ట్రంలో ఉన్న 3,51,93,978 మందికి పంచితే ఒక్కోరి మీద సగటున పడే రుణ భారం అక్షరాల.... రూ. 39,779 కోట్లు.
