జరిగిన పిజిటి, టిజిటి మెయిన్స్ కీ విడుదల అభ్యంతరాలకు 27వ తేదీ వరకు గడువు
తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ చేప్టటిన టిజిటి, పిజిటి మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ శనివారం విడులైంది. పిజిటి, టిజిటి మెయిన్స్ పరీక్షలు మొదలైన రెండు రోజుల తర్వాత కోర్టు స్టే ఇచ్చింది. ఈ పరీక్షలు జులై 18 నుంచి 20వ తేదీ మధ్య కాలంలో జరిగాయి. వెంటనే హైకోర్టు నుంచి స్టే ఆదేశాలు రావడంతో తరువాత పరీక్షలను టిఎస్పిఎస్సీ వాయిదా వేసింది. అయితే తొలి రెండు రోజుల్లో జరిగిన మెయిన్స్ పరీక్షలకు ప్రాథమిక కీ విడుదల చేసింది టిఎస్పిఎస్సీ. తొలి రెండు రోజుల్లో పిజటి మ్యాథ్స్, బయోలజీ, ఫిజికల్ సైన్స్, సోషల్ పరీక్షలు జరిగాయి. అలాగే టిజిటి విభాగంలో మ్యాథ్స్, బయోలజీ పరీక్షలు మాత్రమే జరిగాయి. ఈ రెండు కేటగిరీల్లో పరీక్షలు జరిగిన సబ్జెక్టుల తాలూకు ప్రాథమిక కీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది కమిషన్. ఈనెల 21 నుంచి ఈనెల 27 వరకు అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం ఇచ్చింది టిఎస్పిఎస్సీ. అభ్యర్థులు తమ అభ్యంతరాలను ఇంగ్లీషులోనే లేవనెత్తాలని కోరింది టిఎస్పిఎస్సీ.
27 తర్వాత తుది కీ విడుదల చేసి ఫలితాలు వెలువరించే అవకాశమున్నట్లు టిఎస్పిఎస్సీ వర్గాలు చెబుతున్నాయి.
