హైదరాబాద్: టీఎఫ్‌సీ డైరెక్టర్ తేజో భానును శుక్రవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.ఏపీ ఎన్నికల్లో  తెలంగాణ ఇంటలిజెన్స్ పేరుతో టీఎఫ్‌సీ సర్వే నిర్వహించింది. టీఎప్‌సీ సంస్థపై తెలంగాణ పోలీసులు ఇదివరకే జూబ్లీహిల్స్ పోలీసులు ఫిర్యాదు చేశారు.  

ఈ ఫిర్యాదు ఆధారంగా టీఎఫ్‌సీ సంస్థ డైరెక్టర్ తేజోబానును  పోలీసులు అరెస్ట్ చేశారు.ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారనే విషయమై టీఎఫ్‌సీ సంస్థ సర్వే నిర్వహించింది. అయితే ఈ సర్వేనుతెలంగాణ ఇంటలిజెన్స్ శాఖ నిర్వహించినట్టుగా పేర్కొంది.

ఈ సర్వే ఫలితాలపై తెలంగాణ పోలీస్ శాఖ సీరియస్ అయింది. తెలంగాణ ఇంటలిజెన్స్ శాఖ సర్వే పేరుతో టీఎఫ్‌సీ సంస్థ ఈ ఫలితాలను విడుదల  చేసినందున పోలీసులు తేజోభానును అరెస్ట్ చేశారు.