సంగారెడ్డిలో నిమ్జ్ భూ నిర్వాసితులు పోలీసుల మధ్య తోపులాట: స్పృహ కోల్పోయిన మహిళ
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ లో నిమ్జ్ భూ నిర్వాసితులు బుధవారం నాడు కేటీఆర్ పర్యటనను అడ్డుకొనేందుకు వెళ్తున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, నిర్వాసితులకు మధ్య తోపులాట చోటు చేసుకొంది. ఈ ఘటనలో మహిళ స్పృహ కోల్పోయింది.
హైదరాబాద్: Sangar Reddy జిల్లాలోని జహీరాబాద్ లో NIMZ భూ నిర్వాసితులు బుధవారం నాడు మంత్రి KTR పర్యటనను అడ్డుకొనేందుకు వెళ్తున్న సమయంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులతో నిర్వాసితులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళ స్పృహ కోల్పోయింది. బాధితురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
సంగారెడ్డి జిల్లాలోని zaheerabad లో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు మంత్రి కేటీఆర్. నిమ్జ్ లో ఏర్పాటు చేస్తున్న తొలి పరిశ్రమకు ఇవాళ కేటీఆర్ భూమిపూజ చేయనున్నారు. వీఈఎం టెక్నాలజీ సంస్థ 511 ఎకరాల్లో వెయ్యి కోట్లతో నిర్మిస్తుంది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొంటున్న నేపథ్యంలో నిమ్జ్ భూ నిర్వాసితులు ఇవాళ మంత్రి కేటీఆర్ ను అడ్డుకొనేందుకు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. పొలాల గుండా పెద్ద ఎత్తున భూ నిర్వాసితులు ఒక్కసారిగా రావడంతో పోలీసులు వారిని నిలువరించేందుకు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. పోలీసులతో భూ నిర్వాసితులకు మధ్య తోపులాటతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.
న్యాల్ కల్, ఝరాసంగం మండలాలకు చెందిన భూ నిర్వాసితులు పెద్ద ఎత్తున నిమ్స్ లో కేటీఆర్ నిర్వహించే కార్యక్రమాన్ని అడ్డుకొనేందుకు పొలాల గుండా వెళ్తున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు.