హైదరాబాద్: హైద్రాబాద్ హయత్‌నగర్ లో గురువారంనాడు బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

హయత్‌నగర్ లోని బంజారా కాలనీలో పరిస్థితిని పరిశీలించేందుకు వాటర్ వర్క్స్ ఎండీ దానకిషోర్ వచ్చాడు. అయితే బంజారా కాలనీలో బీజేపీ కార్యకర్తలు  దానకిషోర్ కారును అడ్డుకొన్నారు.

ఈ సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. ఇరు వర్గాలు తోసుకొన్నాయి. ఇరువర్గాలను ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు.ఈ సమయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఇరువర్గాలను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

హయత్ నగర్ సుమారు 32 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో పలు కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరింది.  నగరంలో భారీ వర్షపాతం నమోదైంది. గతంలో కురిరిసన వర్షపాతం  రికార్డులను తిరిగరాసింది.

నగరంలో ఇంకా 1500 కాలనీలు నీట మునిగిపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను కొనసాగుతున్నాయి. ఇంకా పలు చోట్ల కాలనీల్లో  వరద నీరు నిలిచిపోయింది.