ఇందు మృతికి కారణాలు చెప్పాలని ఆందోళన: పోలీస్ వాహనంపై రాళ్ల దాడి, దమ్మాయిగూడలో ఉద్రిక్తత

నాలుగో తరగతి  విద్యార్ధిని ఇందు మృతికి గల కారణాలపై  స్పష్టమైన కారణాలు చెప్పాలని  కోరుతూ   దమ్మాయిగూడలో కుటుంబ సభ్యులు, స్థానికులు  ఆందోళనకు దిగారు. పోలీస్ వాహనంపై రాళ్లతో దాడికి దిగారు.

Tension prevails after  parents  protest  at Dammaiguda  in Hyderabad

హైదరాబాద్: నాలుగో తరగతి విద్యార్ధిని ఇందు మృతదేహంతో  దమ్మాయిగూడలో  స్థానికులు  ఆందోళనకు దిగారు.  గాంధీ ఆసుపత్రి నుండి  ఇందు  మృతదేహనికి  పోస్టుమార్టం నిర్వహించారు. గాంధీ ఆసుపత్రి నుండి అంబులెన్స్ లో  మృతదేహంతో  దమ్మాయిగూడకు తరలించారు పోలీసులు.  ఇందు మృతికి స్పష్టమైన  కారణాలు చెప్పాలని కోరుతూ స్థానికులు  ఆందోళనకు దిగారు. ఇందు డెడ్ బాడీని తరలిస్తున్న  అంబులెన్స్ ను స్థానికులు అడ్డుకున్నారు.  అంతేకాదు పోలీస్ పెట్రోలింగ్ వాహనంపై  రాళ్లు, కర్రలతో దాడి చేశారు.  10 ఏళ్ల ఇందు  ఎలా మరణించిందో చెప్పాలని స్థానికులు కోరుతున్నారు. పోస్టుమార్టం నివేదికలో ఏం తేలిందో చెప్పాలని  స్థానికులు డిమాండ్  చేస్తున్నారు. చిన్నారి ఇందు కుటుంబ సభ్యులు , స్థానికులు  రోడ్డుపై బైఠాయించారు.  ఇందు మృతికి  స్పష్టమైన  కారణాలు చెప్పాలని డిమాండ్  చేస్తున్నారు. చిన్నారి ఇందు కుటుంబ సభ్యులు , స్థానికులు  రోడ్డుపై బైఠాయించారు.  ఇందు మృతికి  స్పష్టమైన  కారణాలు చెప్పాలని డిమాండ్  చేశారు.

నిన్న ఉదయం  దమ్మాయిగూడ ప్రభుత్వ స్కూల్ వద్ద  ఇందును తండ్రి వదిలివెళ్లాడు.  అయితే  స్కూల్  ప్రారంభానికి ముందే  ఇందు  స్కూల్ నుండి బయటకు వచ్చింది.  దుకాణం వద్దకు వెళ్తున్నానని స్నేహితులకు చెప్పి  ఇందు స్కూల్ నుండి వెళ్లింది.  ఈ విషయాన్ని నాలుగో తరగతికి చెందిన ఆమె స్నేహితులు  చెబుతున్నారు.  అయితే  స్కూల్ నుండి ఒంటరిగా బయటకు వచ్చిన ఇందు  చెరువు గట్టు వైపునకు  వెళ్లినట్టుగా సీసీటీవీ పుటేజీలో  పోలీసులు గుర్తించారు.  ఇవాళ ఉదయం దమ్మాయిగూడ చెరువులో  ఇందు మృతదేహం లభ్యమైంది. ఇందు శరీరంలోని ఊపిరితిత్తుల్లో నీరు చేరినట్టుగా  పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక తెలుపుతుంది.  పూర్తి స్థాయి పోస్టు మార్టం నివేదిక రావడానికి  సమయం పట్టనుంది. 

దమ్మాయిగూడ ప్రభుత్వ స్కూల్ లో  ఇందు నాలుగో తరగతి చదువుతుంది.  ఆమె వయస్సు  10 ఏళ్లు.  ఇందు మృతికి  ప్రమాదవశాత్తు  చెరువులో పడిందా.  ఆమెను ఎవరైనా చెరువులో పడేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో  చిన్నారి  ఇందు మృతదేహనికి పోస్టు మార్టం నిర్వహించారు. పోస్టుమార్టం పూర్తైన తర్వాత దమ్మాయిగూడకు అంబులెన్స్ లో  ఇందు డెడ్ బాడీని తరలించారు.  ఇందు మృతదేహన్ని  తరలిస్తున్న అంబులెన్స్, పోలీస్ వాహనాన్ని  పేరేంట్స్,  స్థానికులు అడ్డుకున్నారు . రోడ్డుపై బైఠాయించి  నిరసనకు దిగారు.  ఇందు మృతికి  గల  కారణాలు తెలపాలని డిమాండ్  చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించిన  ఆందోళనకారులను పక్కకు లాగి అంబులెన్స్ లో  ఇందు డెడ్ బాడీని ఇంటికి తరలించారు.

also read:ఇందు అనుమానాస్పద మృతి కేసు... బాలిక ఊపిరితిత్తుల్లో నీటి ఆనవాళ్లు, పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో కీలక విషయాలు

ఇందు మృతదేహన్ని చూసి కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే  ఇందు బతికి ఉండేదని  కుటుంబసభ్యులు ఆరోపణలు చేస్తున్నారు.చెరువు  వద్ద  గంజాయి సేవించే వాళ్లు, మద్యం తాగే వాళ్లకు అడ్డాగా మారిందని స్థానికులు చెబుతున్నారు. గతంలో  ఇదే ప్రాంతంలో మూడేళ్ల పాపపై అత్యాచారయత్నం జరిగిన  విషయాన్ని స్థానికులు గుర్తు చేస్తున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios