లెక్చరర్లు కొడితే 15 రోజులు బెడ్ రెస్ట్: నార్సింగి శ్రీచైతన్య కాలేజీ ముందు సాత్విక్ పేరేంట్స్ ధర్నా


రంగారెడ్డి జిల్లా నార్సింగి శ్రీ చైతన్య కాలేజీలో  ఇంటర్ ఫస్టియర్  విద్యార్ధి  సాత్విక్  ఆత్మహత్య  అంశం  కలకలం రేపుతుంది.  కాలేజీ ముందు  పేరేంట్స్ ఆందోళనకు  దిగారు. 
 

Tension in  Narsingi sri chaitanya college campus after boy dies by suicide

హైదరాబాద్: రంగారెడ్డి  జిల్లా నార్సింగిలో  శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధి  సాత్విక్  ఆత్మహత్య ఘటన  తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది.  సాత్విక్  మృతికి కారణమైన వారిపై  చర్యలు తీసుకోవాలని కోరుతూ   సాత్విక్ పేరేంట్స్  బుధవారంనాడు  ఆందోళనకు దిగారు.   విద్యార్ధి సంఘాల నేతలు  కూడా  ఈ ఆందోళనకు  మద్దతు ప్రకటించారు.  కాలేజీ  ముందు  రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు.ఈ ఆందోళనతో   ట్రాఫిక్ జామ్ అయింది.  వాహనదారులు ఇబ్బంది పడ్డారు..

కాలేజీలోని క్లాస్ రూమ్ లోనే   సాత్విక్  ఉరేసుకొని మంగళవారం నాడు రాత్రి ఆత్మహత్య  చేసకున్నాడు.  ఈ విషయాన్ని గుర్తించిన ఇతర విద్యార్ధులు  సాత్విక్  ను   ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే  సాత్విక్ మృతి చెందాడని సహచర విద్యార్ధులు  చెబుతున్నారు.  సాత్విక్  మృతికి కాలేజీ  అధ్యాపకులే  కారణమని  పేరేంట్స్ ఆరోపిస్తున్నారు. కాలేజీ వైస్ ప్రిన్సిపాల్   విద్యార్ధులను ఇష్టారీతిలో కొట్టేవాడని  సాత్విక్  తల్లిదండ్రులు  చెబుతున్నారు. గతంలో  కూడా సాత్విక్ ను కొట్టడంతో  15 రోజుల పాటు  బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిందని పేరేంట్స్ గుర్తు  చేస్తున్నారు.

 ఈ కాలేజీకి అనుబంధంగా  ఉన్న హస్టల్  లో  కూడా  భోజనం కానీ ఇతర వసతులు  సరిగా లేవని  ఫిర్యాదు  చేస్తే  కూడా బెదిరింపులకు దిగేవారని  సాత్విక్  పేరేంట్స్  చెబుతున్నారు.సాత్విక్ ను కొట్టవద్దని  తాము గతంలోనే కాలేజీ  లెక్చరర్లకు చెప్పినట్టుగా  పేరేంట్స్ మీడియాకు  చెప్పారు.  చిన్న తప్పు చేసినా  కూడా రక్తం  వచ్చేలా  కొట్టేవారని  విద్యార్ధులు  ఆరోపిస్తున్నారు.  

also read:నార్సింగి శ్రీచైతన్య కాలేజీలో దారుణం.. క్లాస్ రూంలోనే విద్యార్థి ఆత్మహత్య..

సాత్విక్  ఆ్మహత్య చేసుకోవడంతో  సహచర విద్యార్ధులు  హస్టల్ వార్డెన్ ను చుట్టుముట్టారు.  దీంతో  హస్టల్ వార్డెన్   గోడ దూకి పారిపోయాడు.   సాత్విక్ ఆత్మహత్య ఘటనతో  కాలేజీకి సెలవులు ప్రకటించింది కాలేజీ యాజమాన్యం. హస్టల్ నుండి విద్యార్ధులను ఇళ్లకు పంపారు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios