తెలంగాణలో ఈ వేసవిలో భానుడి భగభగలు సాధారణంగానే ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలుచోట్ల ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఇక, మార్చి 1 నుంచి వేసవి ప్రారంభమైనట్టేనని హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగం (IMD) అధికారులు తెలిపారు.
తెలంగాణలో ఈ వేసవిలో భానుడి భగభగలు సాధారణంగానే ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలుచోట్ల ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఇక, మార్చి 1 నుంచి వేసవి ప్రారంభమైనట్టేనని హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగం (IMD) అధికారులు తెలిపారు. ఇందుకు రాష్ట్రంలోని పలుచోట్ల నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలే కారణం. గత వారం రోజులుగా రాష్ట్రంలోని పలుచోట్ల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. చాలా చోట్ల పగటి పూట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైనే నమోదవుతున్నాయి.
ఇక, తెలంగాణలో ఈ నెలలో పగటి ఉష్ణోగ్రతలు 37 నుంచి 40 సెల్సియస్ డిగ్రీల వరకు నమోదు కావొచ్చని అధికారులు తెలిపారు. ఏప్రిల్‌లో ఏప్రిల్‌లో 40 నుంచి 45 డిగ్రీలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మే నెల నుంచి జూన్ మొదటి వారం వరకు దాదాపు 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు.
మరోవైపు కోస్తాంధ్ర సహా తెలంగాణలోని ఉత్తర, తూర్పు భాగాల్లో ఎండతీవ్రత బాగా పెరిగే అకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. ఇక, మంగళవారం రాష్ట్రంలో అత్యధికంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 38.9 డిగ్రీల పగటిపూట ఉష్ణోగ్రత నమోదైంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో 15-21 డిగ్రీల మధ్య కనిష్ఠం, 31-32 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతేడాది వేసవి సీజన్ లో ఎండ తీవ్రత తక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు గుర్తుచేస్తున్నారు. ఈ ఏడాది కూడా అదే మాదిరి వాతావరణం ఉండొచ్చని అంచన వేస్తున్నార.
ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వడదెబ్బ తగలడం, డీహైడ్రేషన్ కు గురవ్వడం లాంటి సమస్యలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఎండ తీవత్ర ఎక్కువగా ఉంటే పిల్లలు, వృద్దులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
