తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు  చెబుతున్నారు. ఇప్పటికే ఎండలు మండిపోతుండగా.. గురువారం వాటి తీవ్రత మరింత పెరుగుతుందని చెప్పారు.

ప్రజలు ఎండలో బయటకు రావద్దని వాతావరణశాఖ సహాయ అధికారి వెంకట్రావు సూచించారు. గురువారం ఉష్ణోగ్రత గణనీయంగా పెరుగుతుందని, దీని వల్ల ఎండలో తిరిగితే వడదెబ్బ తగిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ముందుజాగ్రత్త చర్యగా ప్రజలు పగలూ ఇంటి నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు.