Asianet News TeluguAsianet News Telugu

యూట్యూబర్ పెళ్లి .. కట్నాల కింద రూ.4 కోట్లు చదివించిన సబ్‌స్క్రైబర్లు, మన తెలంగాణలోనే

తెలంగాణకు చెందిన యూట్యూబర్ శ్రీ పెళ్లి మౌనిక అనే యువతితో జరిగింది. ఈ సందర్భంగా అతనికి సబ్‌స్క్రైబర్లు రూ.4 కోట్లకు పైగా కానుకలు చదివించారు. 

telugu youtuber shree received wedding gift of 4 crores from subscribers
Author
First Published Dec 16, 2022, 10:06 PM IST

సరదాగా వీడియోలు చేస్తూ తమలోని ప్రతిభను నలుగురితో పంచుకుంటున్నారు యూట్యూబర్లు. వీరిలో నవ్వించేవారూ వున్నారు. యూట్యూబర్లకు సినిమాలు, సీరియల్స్, రాజకీయాల్లోనూ అవకాశాలు లభిస్తున్నాయి. అలా చాలా మంది ఉన్నత ఉద్యోగాలను సైతం విడిచిపెట్టి యూట్యూబర్లుగా కెరీర్ స్టార్ట్ చేస్తున్నారు. ఇలాంటి వాటిలో క్రియేటివ్ థింక్స్ అడ్వెంచర్’’ ఛానెల్. దీనిని సురేశ్ అలియాస్ శ్రీ నిర్వహిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం ఇతను మౌనిక (అన్విక) అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. స్వతహాగా యూట్యూబర్ కావడంతో శ్రీ తన పెళ్లి తంతును కూడా యూట్యూబ్‌లో పెట్టేశాడు. ఎవరైనా అయితే మా జంటను దీవించండి అని కోరతారు. మనోడు కాస్త వెరైటీగా తన పెళ్లికి కట్న , కానుకలు చదివించండి అని కోరాడు. 

ఇంకెముంది ప్రేక్షకులు కూడా అతనిపై అభిమానంతో సీరియస్‌గా తీసుకుని ఏకంగా రూ.4.47 కోట్లను కానుకలుగా సమర్పించారు. ఈ విషయాన్ని స్వయంగా శ్రీనే వెల్లడించాడు. మొత్తం 23,301 మంది సబ్‌స్క్రైబర్లు తనకు కానుకలు సమర్పించారని చెప్పాడు. అయితే ఇక్కడే ట్విస్ట్ వుంది. కట్నాలు పంపాలనుకున్న వారు ఎంత చదివించాలనుకుంటున్నారో, ఏం ఇవ్వాలనుకుంటున్నారో జస్ట్ కామెంట్స్ రూపంలో తెలియజేస్తే చాలని చెప్పాడు. ఆ విధంగా రాసిన మొత్తం రూ.4,37,87,213 కోట్లు. ఇకపోతే.. తన అత్తమామల నుంచి శ్రీ రూపాయి కూడా కట్నం తీసుకోలేదు. ఐదు రోజుల క్రితం పోస్ట్ చేసిన శ్రీ - మౌనికల పెళ్లి వీడియోకు ఇప్పటి వరకు 40 వేలకు పైగా కామెంట్స్ వచ్చాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios