Asianet News TeluguAsianet News Telugu

ఫిలిప్పీన్స్‌లో తెలుగు యువతికి చిక్కులు.. ఆ కారణంతో ఎయిర్‌పోర్ట్‌లోనే అడ్డగింత..

ఫిలిప్పీన్స్‌లో ఓ తెలుగు యువతి ఊహించని పరిణామం ఎదురైంది. ఫిలిప్పీన్స్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్న యువతి కోవిడ్ సమయంలో ఇండియాకు వచ్చింది. అయితే చదువు పూర్తిచేసేందుకు ఆమె ఇటీవల ఫిలిప్పీన్స్ చేరుకోగా.. ఎయిర్‌పోర్టులోనే ఇమిగ్రేషన్ అధికారులు ఆమెను అడ్డుకున్నారు.  

Telugu Girl Stopped by immigration officials in Philippines manila airport
Author
First Published Aug 4, 2022, 1:23 PM IST

ఫిలిప్పీన్స్‌లో ఓ తెలుగు యువతి ఊహించని పరిణామం ఎదురైంది. ఫిలిప్పీన్స్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్న యువతి కోవిడ్ సమయంలో ఇండియాకు వచ్చింది. అయితే చదువు పూర్తిచేసేందుకు ఆమె ఇటీవల ఫిలిప్పీన్స్ చేరుకోగా.. ఎయిర్‌పోర్టులోనే ఇమిగ్రేషన్ అధికారులు ఆమెను అడ్డుకున్నారు.  ఆమె పేరు బ్లాక్ లిస్ట్‌లో ఉందని చెప్పిన అధికారులు.. తిరిగి ఇండియాకు వెళ్లిపోవాలని నవ్యకు సూచించారు. వివరాలు.. హైదరాబాద్ వనస్థలిపురం చెందిన ఎనుగుల నవ్యదీప్తి ఫిలిప్పీన్స్‌లో  వైద్య విద్యను అభ్యస్థిస్తున్నారు. మనిల్లా ప్రాంతంలోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే కోవిడ్ సమయంలో ఆమె ఇండియాకు చేరుకుంది. 

ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో ప్రత్యక్ష తరగతులకు హాజరైందుకు నవ్య ఫిలిప్పీన్స్‌కు బయలుదేరారు. అయితే మనిల్లా ఎయిర్ పోర్టులో నవ్యను అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఆమె పేరు బ్లాక్ లిస్ట్‌లో ఉందని.. ఇండియాకు వెళ్లిపోవాలని సూచించారు. దీంతో ఆమె అక్కడి భారత ఎంబసీని సంప్రదించేందుకు ప్రయత్నించగా అధి సాధ్యపడలేదు. దీంతో ఆమె తిరిగి ఇండియాకు బయలుదేరారు. 

అయితే తాను ఇండియాకు వచ్చిన తర్వాత అద్దె చెల్లించాలని ఇంటి ఓనర్ అడిగారని నవ్య చెప్పారు. అద్దె డబ్బులు చెల్లించానని.. అయిన కూడా ఇలా ఫిర్యాదు చేయడం దారుణమని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios