జూలై 25న ఫిల్మ్ ఛాంబర్‌లో సినీ ప్రముఖుల సమావేశం జరగనుంది. చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్‌లు, ఎగ్జిబిటర్లు, స్టూడియో సెక్టార్ సభ్యులు పాల్గొననున్నారు. 

జూలై 25న ఫిల్మ్ ఛాంబర్‌లో సినీ ప్రముఖుల సమావేశం జరగనుంది. చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్‌లు, ఎగ్జిబిటర్లు, స్టూడియో సెక్టార్ సభ్యులు పాల్గొననున్నారు. సభ్యుల విజ్ఞప్తి మేరకు చిత్రీకరణలపై ఛాంబర్ నిర్ణయం తీసుకోనుంది. అప్పటి వరకు సినిమా కార్యకలాపాలను యధావిథిగా కొనసాగించవచ్చని ప్రకటించింది. 

ఇకపోతే.. టాలీవుడ్‌ చిత్రాలకు సంబంధించిన షూటింగ్‌లను ఆగస్టు 1వ తేదీ నుంచి నిలిపివేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారని.. ఈ మేరకు త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తారనే ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ స్పందించారు. షూటింగ్‌లు ఆపే ప్రసక్తే లేదన్నారు. పలు అంశాలపై నిర్మాతలంతా కూర్చుని చర్చిస్తున్నట్టుగా చెప్పారు. షూటింగ్స్‌ బంద్‌పై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని వెల్లడించారు. మంచి కంటెంట్‌తో సినిమాలు తీయడంపై చర్చించామని తెలిపారు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించే విషయంపైనా కూడా చర్చలు జరుపుతున్నట్టుగా చెప్పారు. అలాగే ఓటీటీలో చిత్రాల విడుదలకు సంబంధించిన అంశంపై కూడా చర్చించామని దిల్ రాజ్ చెప్పారు. 

ALso Read:టాలీవుడ్‌లో షూటింగ్‌లు బంద్‌‌ చేయనున్నారా?.. దిల్ రాజ్ ఎమన్నారంటే..

కోవిడ్ తర్వాత థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య భారీగా తగ్గింది. దీంతో మంచి రెస్పాన్స్ వచ్చిన కొన్ని చిత్రాలు.. ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయాయి. మరోవైపు థియేటర్‌లో రిలీజ్ అయిన కొద్ది వారాలకే సినిమాలను ఓటీటీలో విడుదల చేయడం వల్ల ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. తెలుగు చిత్రాల నిర్మాణ వ్యవయం, ఓటీటీ ప్రభావంపై గత కొద్ది రోజులుగా నిర్మాతలు చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.