Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో విద్యా సంస్థల రీఓపెనింగ్‌కి వైద్యశాఖ గ్రీన్‌సిగ్నల్: సూచనలివీ....


తెలంగాణలో విద్యా సంస్థల రీ ఓపెన్ కోసం వైద్య ఆరోగ్యశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెలలోనే స్కూల్స్, కాలేజీలను రీ ఓపెన్ చేసుకోవచ్చని ఆరోగ్యశాఖ సూచించింది.  కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పాటు ప్రత్యక్ష క్లాసులతోనే విద్యార్థులకు ప్రయోజనమనే అభిప్రాయాలు నెలకొన్న నేపథ్యంలో విద్యా సంస్థల రీ ఓపెన్ కు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు.
 

Telngana helath department green signals to open schools
Author
Hyderabad, First Published Aug 12, 2021, 11:44 AM IST


హైదరాబాద్: తెలంగాణలో విద్యాసంస్థలు  తిరిగి ప్రారంభించేందుకు వైద్య ఆరోగ్యశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినందున స్కూల్స్, కాలేజీలు ఓపెన్ చేసుకోవచ్చని విద్యాశాఖకు సూచించింది. అయితే కరోనా ప్రోటోకాల్స్ పాటించాలని సూచించింది.

వైద్య ఆరోగ్యశాఖ నుండి విద్యాసంస్థల పున:ప్రారంభంపై స్పష్టత రావడంతో విద్యాశాఖ వర్గాలు  సన్నాహలు చేపడుతున్నాయి.  దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో  ఈ మాసంలో స్కూల్స్, కాలేజీలు తిరిగి ప్రారంభించనున్నారు. ఈ నెల 16 నుండి ఏపీలో విద్యా సంస్థలను పున:ప్రారంభించనున్నారు. తెలంగాణలో సినిమా థియేటర్లు ప్రారంభించారు.  స్కూల్స్ ను కూడ తిరిగి ప్రారంభించాలని కూడ వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. తొమ్మిది నుండి ఆపై తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష క్లాసులు నిర్వహించాలనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

ఆన్‌లైన్ క్లాసులతో విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం లేదనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.  దీంతో ప్రత్యక్ష క్లాసుల నిర్వహణతోనే విద్యార్థులకు మేలు అనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.  దీంతో ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు విద్యా సంస్థలను ఓపెన్ చేయాలనే సూచనలు వ్యక్తమౌతున్నాయి.


వైద్య శాఖ సూచనలు

విద్యార్థులకు కరోనా నెగెటివ్‌ రిపోర్టు తీసుకురావాలన్న నిబంధన విధించాలి. జలుబు, దగ్గు, జ్వరం ఉన్న విద్యార్థులను అనుమతించకూడదు.
ప్రతిరోజూ గదులు, కుర్చీలు, బెంచీలు, ఇత ర పరికరాలను శానిటైజ్‌ చేయాలి. చేతుల తో తాకే ప్రతి ప్రదేశాన్ని శానిటైజ్‌ చేయాలి.
మరుగుదొడ్లకు నీటి సదుపాయం కల్పిం చా లి. సబ్బులు అందుబాటులో ఉంచాలి. పారి శుధ్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పించాలి. 
విద్యార్థుల మధ్య భౌతికదూరం ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. 
అవసరమైతే రోజుకు రెండు బ్యాచ్‌లకు వేర్వేరుగా తరగతులు నిర్వహించాలి. లేకుంటే ఒక రోజు ఒక బ్యాచ్, మరుసటి రోజు ఇంకో బ్యాచ్‌కు తరగతులు నిర్వహించాలి. 
విద్యార్థులు, టీచర్లు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. ప్రతి గది వద్ద శానిటైజర్‌ ఏర్పాటు చేయాలి. మాస్క్‌లను కూడా అందుబాటులో ఉంచాలి. 
హాస్టళ్లను ప్రత్యేక జాగ్రత్తల నడుమ తెరవాలి. విద్యార్థుల రూముల్లోకే భోజనం పంపించేలా ఏర్పాట్లు చేయాలి.
 

Follow Us:
Download App:
  • android
  • ios