తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం ఉండడం వల్లే రాష్ట్రంలో ఐటీ అభివృద్ది చెందిందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు.
ఖమ్మం:తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం ఉండడం వల్లే రాష్ట్రంలో ఐటీ అభివృద్ది చెందిందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు.
శుక్రవారం నాడు మంత్రి కేటీఆర్ ఖమ్మంలో పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. దేశ అభివృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ది రేటు ఎక్కువగా ఉందన్నారు.
ఐటీ రంగం తెలంగాణలో పురోగతిలో ఉందని ఆయన తెలిపారు. గూగుల్, ఫేస్‌బుక్ వంటి సంస్థలు హైద్రాబాద్ ను వదిలి ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించనున్నాయని ఆయన చెప్పారు. దీంతో ఐటీ రంగంలో జిల్లాల్లో కూడ ఉద్యోగాలు రానున్నాయని ఆయన చెప్పారు. ఐటీ రంగాన్ని హైద్రాబాద్ కే పరిమితం చేయబోమన్నారు.
ప్రభుత్వ నిర్ణయాల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని ఆయన తెలిపారు. ఖమ్మం అభివృద్ది కోసం మంత్రి అజయ్ అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని ఆయన చెప్పారు.తెలంగాణలో చురుకైన యువత ఉందన్నారు.
