Asianet News TeluguAsianet News Telugu

సభ ముందు తెలంగాణా బడ్జెట్ : ప్రతిపక్షం ప్రశాంతం

 అత్యధికంగా నీటిపారుదల కేటాయింపులు. వ్యవసాయ రుణమాఫీకి చివరి కేటాయింపు

Telangna allocates final tranche for farmer loan waiver in budget

Telangna allocates final tranche for farmer loan waiver in budget

 

 

తెలంగాణా రాష్ట్రానికి  2017-18  బడ్జెట్ ని  ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ఈరోజు మధ్యాహ్నం 12 గుంటలకు ప్రవేశపెట్టారు. ఈటల రాజేందర్ కు ఇది వరుసగా నాలుగో బడ్జెట్‌. ఈ కాలపు  ట్రెండ్ కు తగ్గట్లు గా తెలంగాణా కూడా ఈ బడ్జెట్ లో ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయానికిముగింపు పలికింది. ప్రగతి పద్దు, నిర్వహణ పద్దులను మాత్రమే తీసుకువచ్చారు.

ఈ బడ్జెట్ కేటాయింపుతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు మాఫీ పూర్తవుతుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. చివరి విడతగా రుణమాపీకి రు. 4000కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు.

 

-రాష్ట్ర బడ్జెట్ పరిమాణం రూ. 1,49,646 కోట్లు
- అభివృద్ధి కి రూ. 88,038 కోట్లు
-నిర్వహణ వ్యయానికి  రూ. 61,607 కోట్లు

బడ్జెట్ పాఠం చదువుతున్నంతసేపు  ప్రతిపక్షం నుంచి ఎలాంటి ఆటంకం కలగలేదు. పోతే, అనేక ప్రతిపాదలను ప్రకటిస్తున్నపుడు అధికార పార్టీ సభ్యులు పెద్ద ఎత్తున బల్లలు చరిచారు. టిఆర్ ఎస్ ప్రాధాన్యతకు తగ్గట్టుగా  నీటిపారుదలకు అత్యధికంగా రూ. 26,652 కోట్లు కేటాయించారు.

 

రాష్ట్రంలో   మూడు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటుచేస్తామని మంత్రి ప్రకటించారు. ఇందులో ఒకటి కరీంనగర్ లో ఏర్పాటుచేస్తారు.

 

ఈ ఏడాది చివరి విడత రుణమాఫీకి 4 వేలకోట్లు కేయించారు. దీనితో రుణమాఫీ పూర్తవుతుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు.

 

-మహిళా శిశు సంక్షేమం కోసం రూ. 1731 కోట్లు
-బీసీ సంక్షేమం కోసం రూ. 5,070 కోట్లు
-మైనార్టీ సంక్షేమం కోసం రూ. 1249 కోట్లు
-ఆసరా ఫించన్ల కోసం రూ. 5,330 కోట్లు
-బ్రహ్మణుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు 
-ఫీజు రియింబర్స్ మెంట్ కోసం రూ. 1939 కోట్లు
-చేనేత కార్మికుల కోసం రూ. 1200 కోట్లు


-విద్యారంగ అభివృద్ధికి రూ. 12,705 కోట్లు
-వైద్య, ఆరోగ్య రంగాలకు రూ.5,976 కోట్లు
-పంచాయతీరాజ్ వ్యవస్థకు రూ. 14,723 కోట్లు

-పట్టణాభివృద్ధికి రూ. 5,599 కోట్లు
-మిషన్ భగీరథకు రూ. 3000 కోట్లు
-రహదారుల అభివృద్ధికి రూ. 5,033 కోట్లు
-జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ. 30 కోట్లు
-మిగతా కార్పొరేషన్లకు రూ. 400 కోట్లు
-గ్రేటర్ వరంగల్ కు రూ. 300 కోట్లు

-జీహెచ్ఎంసీకి రూ. 1000 కోట్లు
-పర్యాటక, సాంస్కృతిక రంగానికి రూ. 198 కోట్లు
-శాంతి భద్రతలకు రూ. 4,828 కోట్లు
-ఐటీ రంగానికి రూ. 252 కోట్లు
-హరితహారానికి రూ. 50 కోట్లు
-విద్యుత్ రంగానికి రూ. 4,203 కోట్లు
-పారిశ్రామిక రంగానికి రూ. 985 కోట్లు


-ఎస్టీల అభివృద్ధికి రూ. 8165.88 కోట్లు
-ఎస్సీల అభివృద్ధికి రూ. 14,375 కోట్లు
-నిర్ణీత కాలానికి పథకాల వారీగా 3 నెలలకొకసారి నివేదిక సమర్పించాలి
-ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికకు నిధులు కేటాయించేందుకు కమిటీ ఏర్పాటు చేశాం

 

Follow Us:
Download App:
  • android
  • ios