తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం నాడు మధ్యాహ్నం ముంబైలో మహరాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు.

ముంబై:తెలంగాణ సీఎం KCR మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో ఆదివారం నాడు Mumbaiలో భేటీ అయ్యారు. హైద్రాబాద్ బేగంపేట విమానాశ్రయం నండి ప్రత్యేక విమానంలో ముంబైకి చేరుకొన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కు సినీ నటుడు ప్రకాష్ రాజ్ ముంబైలో స్వాగతం పలికారు.

ఎమ్మెల్సీ కవిత, ఎంపీలను సీఎం కేసీఆర్ Prakash Raj కు పరిచయం చేశారు. ముంబై ఎయిర్ పోర్టు నుండి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బృందం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసానికి చేనుకొంది. అక్కడే ఇద్దరు సీఎంలు భేటీ అయ్యారు. Uddhav Thackerayతో పాటు ఆయన మంత్రివర్గంలో ఇద్దరు కీలక మంత్రులతో పాటు శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ కూడా కేసీఆర్ తో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. సీఎం కేసిఆర్ వెంట ఎమ్మెల్సీ కవిత, ఎంపీ లు జె.సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, బి. బి పాటిల్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి తదితరులున్నారు. 

బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీయేతర పార్టీలతో కేసీఆర్ 2018 నుండి సంప్రదింపులు సాగిస్తున్నారు.అయితే గతంలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలు ఆశించినంతగా ప్రయోజనాన్ని ఇవ్వలేదు దీంతో మరోసారి కేసీఆర్ బీజేపీయేతర పార్టీలను కూడగట్టే పనిలో బిజీగా ఉన్నారు. గత వారంలో ఉద్దవ్ ఠాక్రే కేసీఆర్ ను ముంబైకి రావాలని ఆహ్వానించారు. దీంతో ఇవాళ కేసీఆర్ ఉద్దవ్ ఠాక్రేతో భేటీ కానున్నారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యాచరణపై కూడా చర్చించనున్నారు. సీఎం కేసీఆర్‌ బృందం థాక్రే అధికారిక నివాసం వర్షాలోనే భోజనాలు పూర్తి చేసుకొని ఆ తర్వాత ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ నివాసానికి వెళ్లనున్నారు. జాతీయ రాజ‌కీయ అంశాల‌పై పవార్‌తోనూ కేసీఆర్ చ‌ర్చించ‌నున్నారు. ఆ తర్వాత సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు తిరిగిరానున్నారు.

రెండు వారాల క్రితమే కేసీఆర్ తో బెంగాల్ సీఎం మమత బెనర్జీ కూడా ఫోన్ లో మాట్లాడారు. బిజెపికి వ్యతిరేకంగా వివిధ ప్రతిపక్షాలను కూడగట్టే ప్రయత్నాల్లో భాగంగా సీఎంలను కేసీఆర్ కలుస్తున్నారు.అటు మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) జాతీయ అధ్యక్షుడు HD Devegowda కేసీఆర్‌కు మద్ధతు ప్రకటించారు. దేశంలో మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు సీఎం కేసీఆర్‌ను దేవేగౌడ‌ అభినందించారు. మతతత్వ శక్తుల మీద పోరాటాన్ని కొనసాగించాల్సిందేనని ఆయన చెప్పారు. తాను త్వరలోనే బెంగళూరుకు వచ్చి సమావేశమ‌వుతాన‌ని కేసీఆర్ దేవేగౌడకు చెప్పారు. 

ఇటీవల కాలంలో బీజేపీపై టీఆర్ఎస్ తన విమర్శలను మరింత పెంచింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం ప్రారంభమైంది. ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఈ మాటల యుద్దం తారాస్థాయికి చేరుకొంది. కొన్ని సమయాల్లో రెండు పార్టీల నేతలు వ్యక్తిగత విమర్శలకు కూడా దిగారు. 

సర్జికల్ స్ట్రైక్స్ కు సంబంధించిన ఆధారాలు బయటపెట్టాలని కేసీఆర్ చేసిన డిమాండ్ నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం సాగింది. తమపై సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయిన పాకిస్తాన్ చెప్పినా కూడా ఇంకా ఏం ఆధారాు కావాలని బీజేపీ నేతలు ప్రశ్నించారు. 

కేసీఆర్ కు ఉద్దవ్ ఠాక్రే విందు
తెలంగాణ సీఎం కేసీఆర్ కు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆదివారం నాడు విందు ఇచ్చారు. తన నివాసంలో కేసీఆర్ సహా ఆయన వెంట వచ్చిన బృందానికి సీఎం ఠాక్రే ఇచ్చిన విందును ఆరగించారు. ఉద్దవ్ ఠాక్రేతో పాటు ఆయన తనయుడు కూడా ఈ విందులో పాల్గొన్నారు.