Asianet News TeluguAsianet News Telugu

తెలుగు అకాడమీలో జరిగినట్టే: తెలంగాణ గిడ్డంగుల శాఖలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు మాయం

తెలంగాణలో భారీ గోల్‌మాల్ చోటు చేసుకొంది.. తెలుగు అకాడమీ తరహలోనే గిడ్డంగుల శాఖలో కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లు మాయమైన విషయం వెలుగు చూసింది. ఈ విషయమై గిడ్డంగుల శాఖాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Telangana Ware housing Corporation  Fixed Deposits withdrawn by unkonwon persons From Karwan SBI
Author
Hyderabad, First Published Jan 20, 2022, 11:06 AM IST

హైదరాబాద్: తెలంగాణలో మరో భారీ గోల్‌మాల్ బయటపడింది. Telugu akademy కేసు తరహాలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ Ware housing corporation శాఖలో పెద్ద ఎత్తున నిధులు మాయమయ్యాయి. గిడ్డంగుల శాఖకు చెందిన 4 కోట్ల రూపాయల నిధులు గల్లంతయ్యాయి. కార్వాన్ Sbiలో గిడ్డంగుల శాఖకు చెందిన FDలు మాయమయ్యాయి. ఈ వ్యవహారంపై Hyderabad సీసీఎస్ పోలీసులకు గిడ్డంగుల శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు.  ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ తమకు వచ్చే ఆదాయాన్ని ఖర్చులకు పోను మిగతా మొత్తాన్ని పలు బ్యాంకుల్లో సంస్థ తరఫున ఫిక్సిడ్‌ డిపాజిట్‌ చేస్తుంది. ఇందులో భాగంగానే హైదరా బాద్‌ కార్వాన్‌ ఏరియాలోని యూనియన్‌ బ్యాంక్‌లో గతేడాది జనవరి 6న రూ. 1.90 కోట్లు, 7న మరో 1.90 కోట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసింది. ఈ నెల 6, 7 తేదీలకు ఏడాది కావడంతో డిపాజిట్లను విత్‌ డ్రా చేసుకునేందుకు సంస్థ అధికారులు బ్యాంకును సంప్రదించి, రశీదులు చూపించగా అవి నకిలీవని బ్యాంకు అధికారులు చెప్పారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆన్‌లైన్‌ వివరాలను బ్యాంకు అధికారులకు చూపించారు. పరిశీలించిన బ్యాంకు నకిలీ రశీదు స్థానంలో మరో రశీదును అందించి, అనంతరం నిధులను సంస్థ ఖాతాలో వడ్డీతో కలిపి జమచేశారు. 

తెలంగాణలోని తెలుగు అకాడమీ కేసు పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. తెలుగు అకాడమీకి చెందిన  ఫిక్స్ డ్ డిపాజిట్లు పెద్ద ఎత్తున పలు బ్యాంకుల్లో ఉన్నాయి. అయితే అకాడమీ అధికారులకు తెలియకుండానే నిధులు డ్రా చేయడం కలకలం రేపింది.  ఈ విషయమై పోలీసులు తవ్విన కొద్దీ ఈ కీలక విఁషయాలు వెలుగు చూశాయి. 

2020  డిసెంబరు నుంచి 2021 జులై వరకూ తెలుగు అకాడమీ అధికారులు వివిధ దశల్లో రూ.43 కోట్లు డిపాజిట్‌ చేశారు. అనంతరం ఆగస్టులో యూబీఐ శాఖల నుంచి విత్‌డ్రా చేసుకుని హైదరాబాద్‌లోని రెండు సహకార బ్యాంకుల్లో రూ. 11.37 కోట్లు డిపాజిట్‌ చేశారు. రూ.5.70 కోట్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలుగు అకాడమీ ఖాతాకు బదిలీ చేశారు. మిగిలిన రూ.26 కోట్లు తెలుగు అకాడమీ అధికారులు విత్‌డ్రా చేసుకున్నారు. సరైన అధికారిక పత్రాలు చూసిన తర్వాతే నగదు ఇచ్చాం అని బ్యాంకు అధికారులు పోలీసులకు తెలిపారు. 

తెలుగు అకాడమీకి చెందిన సుమారు 60 కోట్లకు పైగా ఫిక్స్ డ్ డిపాజిట్లను పలు బ్యాంకుల్లో  ఉన్నాయి.ఈ ఫిక్స్ డ్ డిపాజిట్లను  పలు బ్యాంకుల నుండి డ్రా చేశారు. ఈ స్కామ్ లో గత ఏడాది అక్టోబర్ మాసానికి 14 మందిని అరెస్ట్ చేశారు. మరికొందరి కోసం వేట సాగిస్తున్నామని అప్పట్లో పోలీసులు ప్రకటించారు. తెలుగు అకాడమీ కేసులో సాయికుమార్ అనే వ్యక్తి కీలక నిందితుడుగా ఉన్నాడని పోలీసుల తేల్చి చెప్పారు.  సాయికుమార్ సహా ఇతర నిందితులను పోలీసులు విచారించారు. ఈ కేసు విచారణ సాగుతుంది. 

2009  నుండి సాయికుమార్ ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లను స్వాహా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసుల్లో కొందరు బ్యాంకు అధికారుల పాత్రను కూడా పోలీసులు గుర్తించారు. బ్యాంకు అధికారులను ఆయా బ్యాంకు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.మరో వైపు బ్యాంకు అధికారులు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ డబ్బులను తిరిగి ఇచ్చేందుకు కూడా అంగీకరించాయి. 

అసలైన ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాల ద్వారా నగదును డ్రా చేసుకొని నకిలీ ఫిక్స్ డ్ డిపాజిట్ పత్రాలను బ్యాంకుల వద్ద ఉంచినట్టుగా పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. అయితే ఈ కేసులో బ్యాంకు అధికారులు, తెలుగు అకాడమీలో పనిచేసిన కొందరి పాత్ర కూడా ఉందని పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు.  తెలుగు అకాడమీ తరహలోనే తెలంగాణ గిడ్డంగుల శాఖలో కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ల కుంభకోణం బయటకు రావడం కలకలం రేపుతుంది. తెలుగు అకాడమీ స్కాం పాత్రధారులకే ఈ కుంభకోణంతో కూడా సంబంధం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios