‘ఇవాళ సంతోషకరమైన రోజు. ఆగస్టు 15 న నాడు మనకు స్వాతంత్ర్యం రాలేదు. మనకు స్వాతంత్ర్యం కోసం ఏడాది ఆగాం. ఇవాళ మనకు సంపూర్ణ స్వాతంత్ర్య దినోత్సవం’ అన్నారు. 

తెలంగాణ భవన్ లోని టీ ఆర్ ఎస్ కేంద్రకార్యాలయంలో హైదరాబాద్ సంస్థాన విలీన దినోత్సవం జరిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్పిపి నేత డాక్టర్ కె .కేశవ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. 

అనంతరం మాట్లాడుతూ ‘ఈ రోజు మీద ఎటువంటి వివాదాలు అవసరం లేదు.సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినమే’ అని తెలిపారు. ‘ఇవాళ సంతోషకరమైన రోజు. ఆగస్టు 15 న నాడు మనకు స్వాతంత్ర్యం రాలేదు. మనకు స్వాతంత్ర్యం కోసం ఏడాది ఆగాం. ఇవాళ మనకు సంపూర్ణ స్వాతంత్ర్య దినోత్సవం’ అన్నారు. 

అంతేకాదు ... సెప్టెంబర్ 17 పై వివాదాలు అనవసరం లేదన్నారు. భారత్ లో మనము కూడా విలీనం కావాలని కోరుకున్నాం అన్నారు.