Asianet News TeluguAsianet News Telugu

మాస్క్, శానిటైజేషన్ తప్పనిసరి.. లేకుంటే రూ. వెయ్యి జరిమానా: తెలంగాణ అన్‌లాక్ గైడ్‌లైన్స్ ఇవే

తెలంగాణలో అన్‌లాక్ గైడ్‌లైన్స్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. మాస్క్ ధరించడం తప్పనిసరని.. లేనిపక్షంలో వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఆఫీసులు, దుకాణాల్లో కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.

telangana unlock guidelines ksp
Author
hyderabad, First Published Jun 19, 2021, 8:05 PM IST

తెలంగాణలో అన్‌లాక్ గైడ్‌లైన్స్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. మాస్క్ ధరించడం తప్పనిసరని.. లేనిపక్షంలో వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఆఫీసులు, దుకాణాల్లో కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. భౌతికదూరం, శానిటైజేషన్ తప్పనిసరని పేర్కొంది. జూలై 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభిస్తున్నట్లు సర్కార్ తన మార్గదర్శకాల్లో వెల్లడించింది.

4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు తెలంగాణ  కేబినెట్ ఆమోదం తెలిపింది. టిమ్స్‌ను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా ఆధునీకరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే మరో 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. చెస్ట్ ఆసుపత్రి, గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ ప్రాంగణాల్లో ఆసుపత్రులను నిర్మించనున్నారు. అల్వాల్ నుంచి ఓఆర్ఆర్ మధ్యలో మరో ఆసుపత్రి నిర్మాణానికి కేబినెట్ ఓకే చెప్పింది. 

Also Read:తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేత.. కేసీఆర్ కీలక నిర్ణయం, తేలని అంతర్రాష్ట్ర సర్వీసుల అంశం

అంతకుముందు తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పూర్తిగా నియంత్రణలోకి రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అన్ని రకాల ఆంక్షల్ని, నిబంధనల్ని పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో కరోనా కేసులు, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గాయని కేబినెట్ అభిప్రాయపడింది. వైద్య ఆరోగ్య శాఖ నివేదికను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios