అన్నీ ఈ ఏడాదే భర్తీ...
ఒక వైపు ఉద్యోగ ప్రకటలన్నీ వాయిదా పడుతూ ఉంటడటమో, రద్దవుతూ ఉండటమో... ఫైళ్లలో నానుతూ ఉండటమో జరుగుతూ ఉన్నా తెలంగాణా ప్రభుత్వం మరొక భారీ ఉద్యోగ ప్రకటన చేసింది.
ఈ అసెంబ్లీ నుంచి వెలువడిన రెండో చారిత్రాత్మక ప్రకటన ఇది.
ఈ సారి ప్రకటన చేసింది ఉప ముఖ్యమంత్రి , విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి.
మొదటి ప్రకటన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు చేశారు. ఈ ఏడాది చివరకల్లా రెండు లక్షల డబుల్ బెడ్ రూం ఇళ్లను పూర్తిచేస్తామని, చేయకపోతే, ఓట్లను అడిగేది లేదుపొమ్మని శపథం చేశారు.
ఉపముఖ్యమంత్రి అలాంటి శపథం చేయలేదు గాని నిమ్మళంగా చెప్పారు. ఏమని?
“ ఈ ఏడాది, రెసిడెన్షియల్, రెగ్యులర్ స్కూళ్లు కలిపి 17 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నాం.” అని.
ఇది ఉద్యోగాల ఆకలిగొన్నతెలంగాణా నిరుద్యోగులకు ఇక పండగే...
త్వరలో 17 వేల టీచర్ల భర్తీ... మళ్లా ఉద్యోగాల హామీ....
ఒక వైపు ఉద్యోగ ప్రకటలన్నీ వాయిదా పడుతూ ఉంటడటమో, రద్దవుతూ ఉండటమో... ఫైళ్లలో నానుతూ ఉండటమో జరుగుతూ ఉన్నా తెలంగాణా ప్రభుత్వం మరొక ఉద్యోగ ప్రకటన చేసింది. ఈ సారి ప్రకటన చేసింది ఉప ముఖ్యమంత్రి , విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి. ఈ అసెంబ్లీ నుంచి వెలువడిన రెండో చారిత్రాత్మక ప్రకటన ఇది. మొదటిది ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు చేశారు. ఈ ఏడాది చివరకల్లారెండు లక్షల డబుల్ బెడ్ రూం ఇళ్లను పూర్తిచేస్తామని, చేయకపోతే, ఓట్లను అడిగేది లేదుపొమ్మని శపథం చేశారు.
ఉపముఖ్యమంత్రి అలాంటి శపథం చేయలేదు, గాని నిమ్మళంగా చెప్పారు. ఏమని?
“ ఈ ఏడాది, రెసిడెన్షియల్, రెగ్యులర్ స్కూళ్లు కలిపి 17 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నాం.” అని.
ఇది ఉద్యోగాల ఆకలిగొన్నతెలంగాణా నిరుద్యోగులకు పండగే..
"రెండేళ్లలోనే 529 గురుకులాల ప్రారంభించాం.అందులో మూడు వందలను బాలికల కోసం కేటాయించాం. ప్రతి రెవెన్యూ డివిజన్ కు ఒక మహిళా డిగ్రీ కాలేజీ పెట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.’ అని ఆయన చెప్పారు.
వీటిలో ఎన్ని టీచర్ల, లెక్చరర్ ఉద్యోగాలొస్తాయో చూడండనేది మేసేజ్. ఈ విషయాలను శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కడియం చెప్పారు
అంతేకాకుండా, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంగన్‌వాడీలను ప్లేస్కూల్స్‌గా మారుస్తున్నట్లు కూడా కడియం చెప్పారు. ప్రాథమిక పాఠశాల్లలోనే ఈ ప్లే స్కూల్స్ మొదలవుతాయి.
