Asianet News TeluguAsianet News Telugu

భద్రాద్రిలో వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న ముగ్గురు టీచర్లకు పాజిటివ్.. మూతపడిన స్కూల్...

పాజిటివ్ వచ్చిన ముగ్గురు టీచర్ల తో ప్రైమరీ కాంటాక్టులో ఉన్న తొమ్మిది మంది విద్యార్థులు, ఏడుగురు ఉపాధ్యాయులకు కోవిడ్ -19 పరీక్షలు చేశారు. అయితే వీరికి నెగటివ్ వచ్చింది. 

Telangana : Three teachers test positive for Covid, school shut in Bhadradri
Author
Hyderabad, First Published Sep 4, 2021, 9:46 AM IST

హైదరాబాద్ : తెలంగాణలో స్కూల్స్  రీ ఓపెన్ అయిన తరువాత కరోనా బారిన పడుతున్న టీచర్ల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఏటూరునాగారంలోని ప్రభుత్వ పాఠశాలలో ముగ్గురు టీచర్లకు కోవిడ్ -19 పాజిటివ్ గా తేలింది. అంతకు ముందు గురువారం భద్రాద్రి కొత్తగూడెంలో ఒక టీచర్ కు కరోనా సోకడంతో ఒక పాఠశాలను మూసేశారు.  తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలు సెప్టెంబర్ 1 నుండి రీ ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. 

ములుగులోని ఏటూరునాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, ముగ్గురు కరోనా పాజిటివ్ వచ్చిన ముగ్గురు టీచర్లకూ వ్యాక్సిన్ రెండు డోసులూ పూర్తయ్యాయి. 

ఈ  పాఠశాలలో 630 మంది విద్యార్థులు ఉన్నారు, వీరిలో 200 మంది గురువారం తరగతులకు హాజరయ్యారు. కాగా వీరిలో పాజిటివ్ వచ్చిన ముగ్గురు టీచర్ల తో ప్రైమరీ కాంటాక్టులో ఉన్న తొమ్మిది మంది విద్యార్థులు, ఏడుగురు ఉపాధ్యాయులకు కోవిడ్ -19 పరీక్షలు చేశారు. అయితే వీరికి నెగటివ్ వచ్చింది. 

"విషయం తెలియగానే శుక్రవారంనాడు వెంటనే ప్రైమరీ కాంటాక్ట్ లో ఉన్న వాళ్లందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాము. అయితే,  వారందరికీ నెగటివ్ వచ్చింది. అవసరమైతే, కొన్ని రోజుల తర్వాత మళ్లీ పరీక్షలు చేస్తాం. ”అని ములుగు జిల్లా విద్యాశాఖాధికారి (DEO)డి. వాసంతి చెప్పారు.

నిజామాబాద్ జిల్లా, యర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ పాఠశాలలో ఒక విద్యార్థిని, అటెండర్ పాజిటివ్ గా తేలారు. పాఠశాలలోని 75 మంది విద్యార్థులకు కోవిడ్ -19 పరీక్షలు చేశాం.  కానీ పాజిటివ్ కేసులు లేవు. "పాజిటివ్ వచ్చిన ఇద్దరూ క్వారంటైన్‌లో ఉన్నారు. పాఠశాల ఆవరణ మొత్తం శానిటైజ్ చేశాం. మేము సురక్షితంగానే ఉన్నాం ”అని డీఈవో  సీహెచ్ వీఎస్ జనార్ధన్ రావు అన్నారు.

పాజిటివ్‌ వచ్చిన అటెండర్ టీకా రెండు డోసుల తీసుకున్నాడో లేదో తనకు తెలియదని డిఇఒ చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెంలోని గోవిందపురంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, పాజిటివ్ కేసు నిర్ణారణ కావడంతో మూసేశారు. సెప్టెంబర్ 6 న స్కూలు తిరిగి పనిచేస్తుంది. వేరే బిల్డింగ్ నుంచి పనిచేస్తుందని తెలిపారు. స్కూల్ లోని మొత్తం 19 మంది విద్యార్తుల్లో 15 మంది విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారని. వీరిలో ఎవ్వరికీ పాజిటివ్ రాలేదని అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios