తెలంగాణ టెట్ పరీక్షా ఫలితాలు విడుదల:ఇలా చెక్ చేసుకోండి....

తెలంగాణ టెట్ పరీక్షా ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ ఇవాళ విడుదల చేసింది. 
 

Telangana TET Result 2023 announced lns

హైదరాబాద్: తెలంగాణ టెట్ పరీక్షా ఫలితాలను  బుధవారంనాడు ప్రభుత్వం విడుదల చేసింది. వెబ్ సైట్ లో ఫలితాలను తెలంగాణ విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల  15న  టెట్ అర్హత పరీక్షను తెలంగాణ విద్యా శాఖ నిర్వహించిన విషయం తెలిసిందే. టెట్ పరీక్షా ఫలితాలను బుధవారంనాడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.   టెట్ పరీక్షా ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి   .

తెలంగాణ టెట్ లో అర్హత సాధిస్తే జీవిత కాలం వర్తిస్తుంది.  టెట్ పేపర్-1 లో అర్హత సాధించిన అభ్యర్దులు  ఎస్టీటీ, పేపర్ -2 లో ఉత్తీర్ణులైన అభ్యర్ధులు ఆరు నుండి ఎనిమిదో తరగతి విద్యార్ధులకు బోధించేందుకు అర్హులౌతారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ నియామాకాల కోనం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.టెట్ లో అర్హత సాధిస్తేనే  ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో పాల్గొనేందుకు అర్హులు.ఈ నెల  15న నిర్వహించిన టెట్ -1 పేపర్ పరీక్షకు 2.26 లక్షల మంది, పేపర్ -2 పరీక్షకు 1.90 లక్షల మంది అభ్యర్ధులు హాజరయ్యారు.

రాష్ట్రంలోని సుమారు ఐదువేల టీచర్ పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ ఏడాది నవంబర్ 20 నుండి 30వ తేదీ వరకు  డీఎస్పీ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించనుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు  డీఎస్సీ ద్వారా  ఐదువేల పోస్టుల భర్తీ చేస్తే సరిపోదంటున్నారు. ఖాళీగా ఉన్న  15 వేల పోస్టులను భర్తీ చేయాలని ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. టెట్ ప్రిలిమినరీ ఆన్సర్ కీ ని విద్యాశాఖ ఈ నెల  20వ తేదీన విడుదల చేసింది.  టెట్ ఫైనల్ ఆన్సర్ కీ ని కూడ  టెట్ పరీక్షా ఫలితాలతో పాటు  విడుదల చేస్తామని  విద్యాశాఖ గతంలోనే ప్రకటించిన విషయం విదితమే

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios