తెలంగాణ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం షాక్ తగిలింది. ఇటీవల జరిగిన నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. ఇందులో టీఆర్ఎస్ బలపర్చిన పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్‌పై టీఎస్ యూటీఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి 2637 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. 

గెలుపొందిన యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డికి 8924 ఓట్లు రాగా, పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్‌కు 6287 ఓట్లు వచ్చాయి. ఇలా అధికార పార్టీ బలపర్చిన అభ్యర్ధిపై సిపిఎం మద్దతిచ్చిన నర్సిరెడ్డి విజయం సాధించడం సంచలనంగా మారింది. గతంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించిన నర్సిరెడ్డి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. 

మూడు జిల్లాలలో కలిసి మొత్తం 18885 ఓట్లు పోలవగా అందులో 858  ఓట్లు చెల్లకుండాపోయాయి. మిగతా 18027 ఓట్లలో నర్సిరెడ్డికి 8976, పూల రవీందర్ కు 6279,సరోత్తమ్ రెడ్డి 1873 ఓట్లు వచ్చాయి.