ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి మరో యువతిని పెళ్లి చేసుకున్న టీడీపీ నేత కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే... తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి సామ భూపాల్ రెడ్డి కుమారుడు తేజ్‌పాల్ రెడ్డి రాజేంద్రనగర్ పరిధిలోని మోకిల గ్రీన్ విల్లా ప్రాంతానికి చెందిన ఇంటీరియర్ డిజైనర్ సాయిసింధూరిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.

అయితే ఇటీవల సింధూరు.. తేజ్‌పాల్ రెడ్డి వద్ద పెళ్లి విషయమై ప్రస్తావించగా.. నేడు, రేపు అంటూ దాట వేస్తున్నాడు.ఈ క్రమంలో గతేడాది డిసెంబర్‌లో ఆమె శంకర్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, 417, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శుక్రవారం తేజ్‌పాల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అయితే ఇదే నెలలో తేజ్‌పాల్ మరో యువతిని వివాహం చేసుకున్నాడు.